నంద్యాల డ్రామాకి ముగింపు ఎక్కడ..?

0
403
where is the end to nandhyala drama

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

where is the end to nandhyala dramaనంద్యాల త్రాసులో భూమా, శిల్పా వర్గాలను బ్యాలెన్స్ చేయడం ఏపీ సీఎం చంద్రబాబుకు పెద్ద పనిగా మారింది. ఉపఎన్నిక టికెట్ ఏ వర్గానికి ఇచ్చినా.. మరో వర్గం పూర్తిస్థాయిలో పనిచేయదని బాబుకు నివేదికలు చెబుతున్నాయి. అందుకే రెండు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం ఆయన తుది కసరత్తులు చేస్తున్నారు. అటు భూమా, ఇటు శిల్పా వర్గాలు తమ అనుకూలతలు, ప్రత్యర్థుల ప్రతికూలతలపై బాబుకు సవివరంగా చెప్పడంతో.. ఆయన మరింత అయోమయంలో పడ్డారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అఖిలప్రియ శోభా నాగిరెడ్డి స్థాయి లీడర్ కాదని ,ఆమెకు కార్యకర్తలపై అంత పట్టు లేదనేది శిల్పా మాట. పైగా సీనియర్ మంత్రుల్ని కూడా గౌరవించడం లేదనేది పార్టీ వర్గాల అభిప్రాయం. ఇక శిల్పా విషయానికొస్తే ఆయన వైఎస్ హవాలో గెలిచారో కానీ.. ఒరిజినల్ లీడర్ కాదనే విమర్శ ఉంది. అసలు నియోజకవర్గంలో శిల్పాకు బలమే లేదని, భూమా ఫ్యామిలీ బరిలోకి దిగితే.. శిల్పాకు అడ్రస్ గల్లంతు అవుతుందని అఖిలప్రియ వాదిస్తున్నారు. ఇద్దరి వాదనలు విన్న చంద్రబాబు.. వైసీపీ వ్యూహంపై కూడా ఓ కన్నేసి ఉంచారు.

ఇక జగన్ కూడా టీడీపీలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నారు. టికెట్ దక్కకపోతే శిల్పా టీడీపీని వీడుతారన్న సంకేతాలు వస్తున్నా.. జగన్ మాత్రం సైలంట్ గానే ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో వేచి చూస్తున్నారు. జగనే ముందు అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు, బాబే ముందు ప్రకటిస్తారని జగన్ ఎదురుచూడటంతో.. పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. కానీ ఎలాంటి పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకునే అపర చాణక్యుడు చంద్రబాబు.. ఇప్పుడేం నిర్ణయం తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.

Leave a Reply