తెలుగులో దేశభక్తి సినిమాలెక్కడ?

 where freedom fighters telugu movies

తెలుగు సినీ పరిశ్రమ 1931 నుండి ఇప్పటివరకు దేశభక్తి కథా వస్తువుగా తీసిన సినిమాల గురించి పరిశోధిస్తే.. ఇన్నేళ్ల కాలంలో, ఇన్నివేల సినిమాలలో పట్టుమని పది సినిమాలు కూడా దేశభక్తి చిత్రాలు లేకపోవడం, రాకపోవడం తెలుగు ప్రేక్షకుల దౌర్భాగ్యం అని, వారందరికీ సిగ్గుచేటనిపిస్తుంది. బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో, మాలీవుడ్‌లలో ఆఖరికి భోజ్‌పురిలో కూడా కనీసం 25 నుండి 250 చిత్రాలు దేశభక్తి కథా సినిమాలుగా వచ్చాయి.

స్వాతంత్ర సమర కాలంలో దేశభక్తి సినిమాలు ఓ ప్రత్యేకత చాటుకు న్నాయి. వందేమా తరం, మాలపిల్ల, పెద్దమను షులు, రెతే రాజు వంటి సామాజిక అంశాల చిత్రాల వెల్లువ అప్పట్లో ఉండేది. కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. కృష్ణ, ఎన్‌టీఆర్, కృష్ణం రాజు వంటి అగ్రశ్రేణి నాయకులు అల్లూరి సీతా రామరాజు, సర్ధార్ పాపారాయుడు, తాండ్రపా పారాయుడు వంటి చారిత్రక దేశభక్తి సినిమా లకు ఊపిరిలూదారు. అయితే ఈ సినిమాల తరహాలో కేవలం వేళ్లమీద మాత్రమే వచ్చాయి. అందులో మెప్పించిన సినిమాలు కూడా చాలా తక్కువే.

కేవలం 40 ఏళ్ళ చరిత్ర, వందలోపు సినిమా ట్రాక్ రికార్డు వున్న తెలంగాణ సినిమా దేశభక్తి సినిమాల విషయంలో తన వంతు భక్తిని ప్రదర్శించింది.మొదటినుండి తెలుగు సినీరంగం దృష్టి, లక్ష్యం కమర్షియల్ సక్సెస్సే. అప్పుడప్పుడు దేశభక్తి ఇతివృ త్తంతో సినిమాలు తీసినా, వాటిలో కూడా వినో దానికి అగ్రస్థానం ఇచ్చారు. మరోవైపు నానాత ప్పుల తడక లతో తీసిన కొన్ని దేశభక్తి సినిమాలు ఫ్లాప్ కావడంతో, ఇక మరే నిర్మాత, దర్శకుడు ఆ వైపుగా చూడలేకపోతున్నారు. వీటికితోడు స్వా త్రంత్య ఉద్య మం గురించిన అవగాహన మాత్రం లేని నవతం యువత ఇప్పుడు దేశభక్తి సినిమాలు అంతగా రుచించకపోవచ్చు అనే నమ్మకంతో ఉన్నారు. యువత బాలీవు డ్‌లో రంగ్‌దె బసంతి వంటి దేశక్తి సినిమాలను ఎందరు విరగబడి చూశారు అని ప్రశ్నించు కుంటే లోపం, సమస్య దేశభక్తి సబ్జెక్ట్‌లో లేదు.

టాలీవుడ్‌లోని దర్శక నిర్మాతలు, నటులలో మాత్రమే ఉందని తెలుస్తోంది. ప్రేక్షకుడు కావల సిన అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండి దేశభక్తి సినిమాలను కొంచెం మనసుపెట్టి తీస్తే ఆ సిని మాలు హిట్ చేయడానికి సిద్ధంగానే ఉంటారని గతంలో రుజువైంది. కళలలో నవరసాలు ఉన్నట్లు మన సిని మాలో అందరూ మాట్లాడే ఎమోషన్‌లాగే దేశభక్తి కూడా ఒక బలమైన ఎమోషన్. కామెడీ, ఎంటర్ టైన్‌మెంట్, యాక్షన్, రొమాన్స్‌లలాగే దేశభక్తి కూడా ఒక భావోద్వేగమే! అయితే ఇది, ఒక మనిషికి తాను పుట్టి, నివశి స్తున్న నేలమీద ఉండే ఆత్మీయ అనుబంధం.

ఆ నేలమీద ఉన్న సం స్క­ృతి సంప్రదాయాలు, వ్యవహారాలతో మనిషికి ఉండే ఆధ్యాత్మిక బంధమే దేశభక్తి. మరోమా టలో తన అస్తిత్వాన్ని మొత్తంగా తన దేశంతో మమేకం చేయడమే దేశభక్తి. ఈ విధమైన అం శాల ఆధారంగా అల్లుకున్న కథలతో తెరకెక్కిన సినిమాలే దేశభక్తి సినిమాలు. ఈ అంశం సిని మాలపై హాలీవుడ్, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్ సినీ నిర్వచనాలు వేరుగా ఉన్నాయి. ఆ కోణంలో పరిశీలిస్తే భారతీయ సినిమాల దౄఎక్కోణంలో దేశభక్తి సినిమాలకు ప్రత్యేక లక్షణా లున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలలో ఆ లక్షణాలను అన్వయిస్తే ఇలా వుంటాయి.

స్వాత్రంత్యోద్యమ నేపథ్యం- స్ఫూర్తి- : మనదేశం (1949), సర్దార్ పాపారాయుడు (19 80), సుభాష్‌చంద్రబోస్ (2005), రాజన్న (20 12). 2.జాతీయ నాయకుల జీవనగా« దలు- అల్లూరి సీతారామరాజు (1974), ఆంధ్రకేసరి (1983), తాండ్ర పాపారాయుడు (1980), 3.జాతీయ నాయకుల ఆశయ సాధన – బొబ్బిలి పులి (1982), రేపటి పౌరులు (1980), మేజర్ చంద్రకాంత్ (1993), శంకర్‌దాదా జిందాబాద్ (2007), మహాత్మా (2009) మరోప్రపంచం, రుదవ్రీణ (19 88), ఠాగూర్, స్టాలిన్ (2006).

యువత బాలీవుడ్‌లో రంగ్‌దె బసంతి వంటి దేశక్తి సినిమాలను ఎం దరు విరగబడి చూశారు అని ప్రశ్నించు కుంటే లోపం, సమస్య దేశభక్తి సబ్జెక్ట్‌లో లేదు. టాలీ వుడ్‌లోని దర్శక నిర్మాతలు, నటులలో మాత్రమే ఉందని తెలు స్తోంది. ప్రేక్షకుడు కావలసిన అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండి దేశభక్తి సినిమా లను కొంచెం మనసుపెట్టి తీస్తే ఆ సినిమాలు హిట్ చేయడానికి సిద్ధంగానే ఉంటారని గతంలో రుజువెంది.

SHARE