Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రికార్డులు అనేవి క్రియేట్ అవుతుంటాయి, బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు క్రియేట్ అయిన అన్ని రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం అని, ఇప్పుడు కాకుంటే ఇంకొంత కాలంకు అయినా బ్రేక్ కావాల్సిందే అనుకున్నాం. అది బాలీవుడ్ సినిమాకు సంబంధించిందైనా, టాలీవుడ్ లేదా మరే వుడ్‌కు చెందిన రికార్డు అయినా ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కావాల్సిందే. కాని తాజాగా ‘దంగల్’ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పట్లో కాదు, అసలు బ్రేక్ అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ దంగల్ సినిమా చైనాలో సృష్టించిన ప్రభంజనం అక్కడ సినిమాలను కూడా క్రాస్ చేసింది.
మే 5న చైనాలో విడుదలైన ‘దంగల్’ చిత్రం అక్కడ 500 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని బాలీవుడ్ వర్గాల వారు భావించారు. అయితే కొందరు అంత కూడా వసూళ్లు చేయలేదని అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే అంతా అవాక్కవుతున్నారు. కేవలం 25 రోజుల్లో దంగల్ చిత్రం చైనాలో 1000 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. వేరే దేశంకు చెందిన చిత్రం చైనాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. గతంలో కూడా అమీర్ ఖాన్ నటించిన చిత్రాలు చైనాలో విడుదల అయ్యాయి. కాని వంద, రెండు వందల కోట్లు మాత్రమే వసూళ్లు చేశాయి. కాని ‘దంగల్’ చిత్రం వెయ్యి కోట్లను వసూళ్లు చేయడంతో ఈ రికార్డు ఇప్పట్లో కాదు, రానున్న పది పదిహేను సంవత్సరాల వరకు కూడా బ్రేక్ అవ్వడం కష్టమే అంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలో ‘బాహుబలి 2’ చిత్రం చైనాలో విడుదల కాబోతుంది. దంగల్ కలెక్షన్స్‌లో సగం వసూళ్లు చేసినా కూడా సంచలనమే అనుకోవచ్చు.