జగన్ vs ఆంధ్రజ్యోతి …ఏది నిజం ?

 which truth jagan vs andhrajyothi

వై.ఎస్.జగన్,ఆంధ్రజ్యోతి మధ్య పోరాటం పాతవ్యవహారమే .అయితే ఇప్పుడు మరో కొత్త అంశంతో ముందుకొచ్చింది .ఈ దేశప్రధమ పౌరుడు ..రాష్ట్రపతి ఏమన్నారన్నదానిపై ఇద్దరిదీ చెరో మాట ? ఎవరు చెప్పేది నిజం?ఎవరిని నమ్మాలి ?


పుష్కర ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళినప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అయన పనితీరుని ప్రశంసించారని ఆంధ్రజ్యోతి కధనం ..అలాంటిదేమీలేదు బాబే కావాలని అలా రాయించుకున్నారని ..ఇక ఆ పత్రిక సంగతి తెలిసిందే అన్న ధోరణిలో జగన్ మాట్లాడారు .బాబుని ప్రణబ్ పొగిడారో లేదో గానీ జగన్ విమర్శల తర్వాతే ఆ మాటలకి ప్రాధాన్యం పెరిగింది .అంతకన్నా ముఖ్యమైన విషయం పెద్దల్ని కలిసినప్పుడు ఏదో ఓ సంభాషణ రావడం ..కాస్తోకూస్తో వచ్చిన వారిని గురించి ఓ మంచి మాట మాట్లాడ్డం మన అతిధి సాంప్రదాయాల్లో సహజ విషయం ..అలాంటి విషయానికి అధిక ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం ఇద్దరికీ లేదు .పైగా ఈ విషయంలో ఓ పెద్దాయన ప్రస్తావన వున్నప్పుడు కాస్త సంయమనం అవసరం .ప్రణబ్ దీని గురించి మాట్లాడేదాకా నిజం ఏమిటో తెలియదు .ఇలాంటి చిన్నచిన్న విషయాలపై రాష్ట్రపతి మాట్లాడతారా?సాధ్యం కాదు కదా ..


జగన్ తమపై విమర్శ చేయగానే ఆంధ్రజ్యోతి మరో బాంబు పేల్చింది .బాబుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జగన్ కి షాక్ తగిలిందని ఇంకో వార్త ప్రచురించింది .జగన్ సమక్షంలోనే బాబుని ప్రణబ్ పొగిడారని తాజా కధనం ..దీనికి మళ్లీ జగన్ కౌంటర్ వేయాలి..అయితే జరిగిన దానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగే పరిస్థితి మాత్రం లేదు .ఎందుకంటే ఆ ప్రశ్న అడిగేముందు సాక్షి కథనాలపై వివరణ ఇవ్వాల్సివుంటుంది .గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరే ప్రయత్నం చేయతగునా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here