పవన్ కి మనీ పవర్ ఇచ్చేదెవరు?

0
565

 who giving money pawan kalyan janasena party
2019 ఎన్నికలే లక్ష్యంగా పవన్ నేతృత్వం లోని జనసేన పావులు కదుపుతోంది.రాజకీయ వ్యూహాలు ఎలా వున్నా పార్టీరధాన్ని నడిపే ఇంధనం …అదేనండి ..ధనం ఎవరు సమకూరుస్తారు ?పవన్ సరేనంటే ఇవ్వడానికి చాలామంది రెడీ గా వున్నా వారి వ్యవహారశైలి పార్టీ పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని జనసేన భయపడుతోంది.ఇప్పటికే పార్టీ ఆర్ధిక వ్యవహారాల్లో అండగా ఉంటామని పవన్ ని కలిసిన వారిలో చాలా మంది ప్రముఖులున్నారు.

గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసి ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు పవన్ మీద భారీ ఆశలే పెట్టుకున్నారట.విజయవాడకి చెందిన ఓ మాజీ ఎంపీ,గుంటూరు జిల్లాకి చెందిన ఓ మాజీ మంత్రి…చంద్రబాబు క్యాబినెట్ లో పని చేస్తున్న ఓ మంత్రి ,రాయలసీమకి చెందిన ఓ రెడ్డి నాయకుడు పవన్ ని కలిసి పార్టీ కోసం ఆర్ధికసాయం చేస్తామని మాటిచ్చారట.అయితే వీరి రాజకీయ గతం ,భవిష్యత్ ఆశలు జనసేన మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోడానికి పవన్ ముఖ్యుల అభిప్రాయాలు సేకరిస్తున్నారట.వచ్చే ఫీడ్ బ్యాక్ ని బట్టే జనసేన నిర్ణయం ఉంటుందనడంలో సందేహం లేదు.

Leave a Reply