Posted [relativedate]
తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్ తో తెలుగులో తీసిన తక్కువ సినిమాలకే ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ గుణశేఖర్ లాస్ట్ ఇయర్ తీసిన రుద్రమదేవి సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఆ సినిమా ఇచ్చిన ఇన్స్ ప్రేషన్ తో ప్రతాప రుద్రుడు సినిమా చేయాలని అనుకున్నారు గుణశేఖర్. అది ఎందుకో లేట్ అయ్యేట్ట్ ఉంది అని ఈలోగా మరో పౌరాణిక కథను ఎంచుకున్నారు.
కొద్దిరోజులుగా గుణశేఖర్ హిరణ్యకశ్యప సినిమా చేస్తున్న వార్త తెలిసిందే. అయితే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఇక్కడ ఒకే ఇమేజ్ ఉన్న హీరోని చూస్తున్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం సూర్య, కార్తిలలో ఒకరు సినిమాలో నటిస్తారని టాక్. భక్త ప్రహ్లాద కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘హిరణ్యకశ్యప’ ట్యాగ్ లైన్ గా ది స్టోరీ ఆఫ్ భక్త ప్రహ్లాద అని పెట్టబోతున్నారట.
తమిళ హీరోలే అయినా తెలుగులో దాదాపు ఇక్కడ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న కార్తి సూర్యలలో ఒకరు కచ్చితంగా గుణశేఖర్ హీరో అయ్యే అవకాశాలున్నాయట. మరి ఆ లక్కీ ఛాన్స్ అన్న తీసుకుంటాడా లేక తమ్ముడు తన్నుకుపోతాడా అన్నది చూడాలి.