అపోలో లో అమ్మ వారసత్వ నిర్ణయం ..

4810

Posted [relativedate]

who is the next tamil nadu chief minister
చెన్నై అపోలో ఆస్పత్రి వేదికగానే అమ్మ వారసత్వం ఎవరిదో తేలిపోనుంది.ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆస్పత్రికి రావాల్సిందిగా సందేశం వెళ్ళింది. గవర్నర్ విద్యాసాగరరావు సమక్షంలో జయ వారసత్వం మీద అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సరికొత్త నాయకత్వం మీద తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశముంది. దీనికి సంబంధించి ఓ డిక్లరేషన్ రెడీ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇంతకుముందే జయ తన వారసుడిగా సినీ నటుడు అజిత్ వైపు మొగ్గుజూపుతూ వీలునామా రాసారని ప్రచారంలో వుంది.అందులో నిజమేమిటో బయటకు రాకపోయినా శశికళ లేదా ఆమె తరపు మనిషి కొత్త వారసుడు అయ్యే అవకాశాలు లేకపోలేదని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఇప్పటికే పన్నీర్ సెల్వన్ ను ప్రత్యేకంగా ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో అపోలో లో జరిగే ఎమ్మెల్యేల సమావేశం కీలకం కానుంది.అయితే ఆ భేటీ చర్చగా ఉంటుందా లేదా రచ్చ అవుతుందా అనే సందేహాలు కూడా వున్నాయి.మరికొన్ని గంటల్లో ఈ వ్యవహారం తేలి తమిళనాడుకి కొత్త నేత ఎవరో తేలిపోనుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here