ఈ వీకెండ్ హీరో ఎవరో??

91

Posted [relativedate]

who is the weekend hero in between manoj raj tarun and vijay devarakondaప్రస్తుతం టాలీవుడ్ లో విన్నర్, ఘాజీ సినిమాలు  తప్ప మరో తెలుగు సినిమా ధియేటర్లలో సందడి చేయడంలేదు. సంక్రాంతి బరిలో పెద్దహీరోల సినిమాలు నిలవడంతో యంగ్ హీరోలందరూ దాదాపు ఫిబ్రవరి, మార్చి నెలలపైనే  కన్నేశారు. ఈ వీకెండ్ కి చిన్నహీరోలందరూ తమ సినిమాలను వరుసపెట్టి విడుదలచేస్తున్నారు. మార్చ్ 3వ తేదీన అంటే ఎల్లుండి మంచు మనోజ్, రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. మంచు మనోజ్ ‘గుంటూరోడు’గా వస్తుంటే ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అంటూ రాజ్ తరుణ్ రెచ్చిపోనున్నాడు. ఇక  విజయ్ దేవరకొండ చేసిన ‘ద్వారక’ కూడా అదే రోజున రిలీజ్ కానుంది.

ఈ మూడు చిత్రాల్లో మనోజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరోడు  పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.  రాజ్ తరుణ్  కిట్టు ఉన్నాడు జాగ్రత్త కూడా ట్రైలర్స్ తో వైవిధ్యమైన సినిమా అనే పేరు తెచ్చుకుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా పెళ్లి చూపులుతో మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో ద్వారక  పట్ల కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఉంది. మరి ఈ రేస్ ఏ హీరో గెలుస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here