పట్టాలపై సెల్ఫీకి ఐదేళ్లు జైలు ..

   who selfie in front of train get 5 years jail

సెల్ఫీ పిచ్చి బాగా పెరిగిపోయింది. ఎక్కడపడితే అక్కడ.. సెల్ఫీలు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సమయం సందర్భం లేకుండా కొందరు సెల్ఫీలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాపాయం ఉన్నప్పటికీ.. ఏమాత్రం లెక్కచేయకుండా సెల్ఫీల కోసం రైళ్ల కిందపడి మృతి చెందుతున్నారు. ఇలాంటి చర్యలను నివారించేందుకు కఠిన చర్యలు తప్పవని రైల్వే అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.

సెల్ఫీ మోజులో ప‌డి ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంటున్న యూత్ కు అడ్డుక‌ట్ట‌వేసేందుకు రైల్వే ట్రాక్‌ల పైనా, నడిచే ట్రైన్ల ముందు సెల్ఫీలు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించే వారు ఇక‌పై ఆ చ‌ర్య‌లు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై రైల్వే యాక్ట్ 1989లోని మూడు సెక్షన్లను అమలు చేసేందుకు స‌న్న‌ద్ధ‌మైంది. ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంటే ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించనుంది రైల్వేశాఖ.

SHARE