హోదాకి మద్దతు..ప్యాకేజీ కి పట్టు..ఎవరు?

0
463

  who special status package support
కమలనాధులు భయపడుతున్నట్టే ఆంధ్రకు ప్రత్యేకహోదా అంశాన్ని వివిధ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకు భలే వాడుకుంటున్నాయి.ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెగ వాదిస్తూ వచ్చింది ఓ పార్టీ..ఓ రాష్ట్రంలో అధికారం కూడా వెలగబెడుతున్న ఆ పార్టీ నిర్ణయం చూసి ఆంధ్ర నేతలు సంతోషపడ్డారు.ఆ పార్టీ నిర్ణయం ఓ రాష్ట్రప్రభుత్వ నిర్ణయంగా కూడా తీసుకున్నారు.

అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.పార్లమెంట్లో వస్తున్న ఒత్తిడి,ఇతర కారణాలతో కేంద్రం ఆంధ్రకు ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతోంది.ఈ విషయం అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు మొదలయింది.ఓ వారంలో ప్యాకేజీ ప్రకటన రావచ్చు అనుకుంటున్న సందర్భంలో హోదాకి మద్ధతిచ్చిన ఆ పార్టీ ప్లేట్ తిరగేసింది.తమరాష్ట్రానికి కూడా ప్యాకేజీ ఇవ్వాలని పార్లమెంటుని హోరెత్తించింది.

ఇంతకీ ఆ పార్టీ సమాజ్ వాదీ ..ఆ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ..7,8 నెలల్లో వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలోఉంచుకుని ఇంత కథ నడిపింది సమాజ్ వాది అధినేత ములాయం సింగ్ …ఆయన ఎత్తులు చూసి ఔరా అనుకోక తప్పదు.పక్క రాష్ట్రానికి మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి తమకో రాజకీయ ఆయుధం సృష్టించుకున్న
ములాయం తెలివితేటల గురించి ఎంతని చెపుతాం..ఏమని చెపుతాం

Leave a Reply