గెలిస్తే మనోళ్ల no1 పదిలం… ఓడితే వాళ్ళు no1

0
446

 who will achieve no1 test rank india pakistanఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మొద‌టి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. శ్రీలంక ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన మూడు టెస్ట్ మ్యాచుల్లో శ్రీలంక క్లీన్ స్వీప్ చేయ‌డంతో తొలిర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా 108 పాయింట్లతో మూడో స్థానానికి ప‌డిపోయింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచులు నెగ్గి భార‌త్ తొలిస్థానం కైవ‌సం చేసుకుంది.

గ‌త‌వారం ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ విజ‌యం సాధించి సిరీస్‌ను 2-2 స‌మం చేసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్ రెండో స్థానంలో నిలిచింది. భార‌త్ తొలి ర్యాంకులో కొన‌సాగాలంటే  గురువారం క‌రేబియ‌న్ల‌తో జ‌రిగే ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌లో త‌ప్ప‌కుండా గెల‌వాల్సిన పరిస్థితి ఉంది. ఒక‌వేల ఓడిపోతే తొలిసారిగా పాకిస్తాన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్ర‌థ‌మ స్థానాన్నిసొంతం చేసుకుంటుంది. మ‌రోవైపు ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉండ‌గా.. శ్రీలంక ఆరో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా ఏడో స్థానంలో ఉంది

Leave a Reply