బాబు పుష్కర పాటెందుకు పాడుతున్నారు?

0
500

 why chandrababu interesting pushkaralu works
తెలుగు రాష్ట్రాల్లో పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశాయి రెండుప్రభుత్వాలు.ప్రారంభ స్నానం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు.కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం నిత్యం పుష్కర పాటే పాడుతున్నారు.ఇక క్యాబినెట్ మంత్రులంతా ఘాట్ ల దగ్గరే మకాం పెట్టినట్టు కనిపిస్తున్నారు .అధికారులతో రివ్యూ లు కూడా పుష్కరఏర్పాట్ల పైనే ..ఇంతకన్నా చెప్పుకోవలసింది హారతి ఎపిసోడ్..ఎన్నిపనులున్నా చంద్రబాబు ఆ టైం కి సాధ్యమైనంత వరకు అక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ?ఇదంతా ఎందుకు? పాలనావ్యవస్థ మొత్తం పుష్కరాల దగ్గరే కేంద్రీకృతం కావడం వెనుక కారణాలేంటి?

పై ప్రశ్నలకి ఎన్నో సమాధానాలు విన్పిస్తున్నాయి .ఒక్కో సమాధానం వెనుక ఒక్కో దృక్కోణం .వయసుతో పాటు బాబుకి భక్తి పెరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.రాజధాని ఎంపిక లోను వాస్తుకి ఇచ్చిన ప్రాధాన్యం ఆయనలో వచ్చిన మార్పుకి సంకేతంగా చూపుతున్నారు .అయితే ఇందులోనూ రాజకీయ కోణం ఉందనేవారు లేకపోలేదు .పుష్కరాల్ని బాగా నిర్వహించి సామాన్యుల దగ్గర క్రెడిట్ కొట్టడం ఒక ఎత్తు అయితే…నిధుల్లేమితో అభివృద్ధి కుంటుపడుతున్న విషయంపై ప్రజల దృష్టి పడకుండాచూడడం మరో ఎత్తు..వినడానికి ఈ రెండు కారణాలు సహేతుకంగానే కన్పిస్తున్నాయి .అసలు నిజం ఆ బాబుగారికే తెలియాలి

Leave a Reply