Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? సినీ అభిమానుల్ని ఎప్పటినుంచో ఊరిస్తున్న ప్రశ్న ఇది. జగన్ జైలుకి వెళతాడా ? రాజకీయ ఆసక్తి వున్న వారికి,ముఖ్యంగా వైసీపీ అభిమానులని టెన్షన్ పెడుతున్న విషయం ఇది.గుప్పిట మూసి వున్న ఈ రెండు సీక్రెట్స్ మధ్య భలే లింక్ ఏర్పడింది. అదేంటో తెలుసా ? ఈ రెండు సీక్రెట్స్ ఒక్కసారే బట్టబయలు అవుతాయి.ఒకే రోజు ఈ సీక్రెట్స్ రివీల్ కానున్నాయి.ఏప్రిల్ 28 న బాహుబలి సినిమా విడుదల అన్నది బహిరంగ రహస్యమే. ఇక జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటీషన్ మీద విచారణ పూర్తి చేసిన సిబిఐ కోర్టు తీర్పుని ఏప్రిల్ 28 కి వాయిదా వేసింది.ఆ రోజే రెండు సీక్రెట్స్ ముడివిడిపోనుంది.
బాహుబలి,జగన్ బెయిల్ ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయాలు.అయినా ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు విషయాలు తెలుగు సమాజంలో ఎక్కడలేని ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ఈ రెండు అంశాలపై చర్చించుకుంటూనే వున్నారు.ఇప్పుడు ఆ రెండు సీక్రెట్స్ తెలిసిపోయే రోజు కోసం “ఎన్నాళ్ళో వేచిన ఉదయం”అని పాడుకుంటూ ఎదురు చూస్తున్నారు.