నీటి కోసం ఒక రోజు ఎందుకు?

0
460
why you celebrate World Water Day

  Posted [relativedate]

why you celebrate World Water Day

▪నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి. పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు.

మీకు తెలుసా?

▪ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది.

▪ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300 లీటర్ల నీరు ఖర్చవుతుంది.

▪ప్రపంచంలోని మంచినీటిలో 70 శాతాన్ని వ్యవసాయంలో, 22 శాతం పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు.

▪అరకిలో కాఫీ తయారవడానికి 11,000 లీటర్ల నీరు అవసరం.

▪ప్రపంచంలో నీటిపై జరుగుతున్న వ్యాపారం విలువ 400 బిలియన్‌ డాలర్లు.

▪ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపో తున్నారు.

▪అమెరికాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే, ఆఫ్రికాలోని గాంబియా దేశంలో ఒక వ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు.

మనమేం చేయాలి?

◆ఎక్కడైనా కొళాయిల్లోంచి నీరు వృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెంటనే కట్టేయండి.
◆షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్‌ నీళ్లతో చేయండి. దీని వల్ల రోజులో 150 లీటర్ల నీటిని కాపాడవచ్చు.
◆పళ్లు తోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడం వల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది.
◆టాయిలెట్‌ ఫ్లష్‌లో సుమారు 8 లీటర్ల నీరు పడుతుంది. లీటర్‌ నీరు పట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్న చిన్న రాళ్లు నింపి, టాయ్‌లెట్‌ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండు లీటర్ల నీళ్లు ఆదా అవుతాయి.
◆అక్వేరియంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.
◆కొళాయిలకి లీకేజీలు ఉంటే దానిని అరికట్టండి. దీనివల్ల నెలలో 300 గ్యాలన్ల నీరు ఆదా అవుతాయి.
◆స్కూల్లో, మీ ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచండి.

▪ఒక సందర్భంలో..మనమాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు 2050 నాటికి ప్రపంచ పరిస్థితిని ఇలా అంచనా వేసారు…

2050 నాటికి ఈ ప్రపంచంలో త్రాగడానికి పుష్కలమైన జలం ఉండనే ఉండదని, స్నానాలు చేయడం మానేసి జనం శరీరానికి రసాయనికలేపనాలు పులుముకుంటారని, కెమికల్ బాత్ చేస్తారని, సరిహద్దుల్లో ఉండవలసిన సైన్యం నీటి వనరుల చుట్టు కాపలా ఉంటారని, తలంటు కోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడి గుండుతో జీవిస్తారనీ, స్త్రీపురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని, ఇంకా ఇలాంటి అనేక భయానకమైన విషయాలను తన ప్రెసంటెషన్‌లో ఉంచారు.
నిజమే..మనం నీటిని సరిగా ఉపయోగించకపోతే..ఇవన్నీ నిజాలు కావచ్చేమో..! ఆలోచిద్దామా మరి..!!

MGL ఆంజనేయులు 

Leave a Reply