సెక్స్ అంటే ఆసక్తి ఉండటం లేదా.? కారణాలు .. మార్గాలు

0
675
wife and husband not interested in sex reasons and solutions

Posted [relativedate]

wife and husband not interested in sex reasons and solutionsపడక సుఖం మీద ఆసక్తి ఉండటం లేదా ..లేక పూర్తిగా తగ్గిపోతుందా..తగ్గుతుందటే అసలు తగ్గ నివ్వొద్దు ఎందుకంటె ఆలా ఆసక్తి తగ్గితే చాల నష్టాలు వున్నాయి అంటున్నారు నిపుణులు.లైంగికాసక్తి తగ్గటాన్ని వైద్య పరిభాషలో ‘హైపోయాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌’ అంటారు.ఇది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య.18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూ వుంటారు. ఈ తరహా సమస్యకు మానసికపరమైన, శారీరకపరమైన…రెండు కారణాలు యుక్త వయస్కులతో పోలిస్తే మధ్యవయస్కులైన మహిళల్లోనే హైపోయాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌’ అధికం.

***తల్లి కావడం వరకే సెక్స్ అనుకొనే భ్రమ లో వున్నా ఆడవాళ్లు బోలెడు మంది వీళ్ళు తల్లవగానే లైంగి క ఆసక్తి తగ్గుముఖం పడుతుంది.
***తల్లవటంతో ఇక సెక్స్‌ అవసరం ఏముందనే ఆలోచన వాళ్లలో తెలత్తడమే ఇందుకు కారణం.
**వీళ్లలో ఆసక్తి లేకపోయినంత మాత్రాన సెక్స్‌కు పనికిరారని చెప్పటానికి లేదు. అన్నివిధాలా ఆరోగ్యంగానే ఉన్నా లైంగిక చర్య మీద ఆసక్తి, ఇష్టం లోపించిందంటే ఆ చర్యకు తగినంత ప్రాధాన్యత ఇవ్వటంలేదని అర్థం చేసుకోవాలి.
**సమస్యని బహిర్గతంగా చెప్పుకోడానికి సిగ్గుపడి మనసులోనే దాచుకోవడం.

*** ఈ సమస్యకు హార్మోన్లకు దగ్గరి సంబంధం ఉంది. లైంగికంగా ఉద్రేకం చెందటంలో, లైంగిక చర్యలో పాల్గొనటంలో, తృప్తి పొందటంలో స్త్రీ శరీరంలోని ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
***40 ఏళ్ల వయసుకి చేరుకున్నప్పుడు స్త్రీల అండాశయాల నుంచి అండాల విడుదల ఆగిపోతుంది. దాంతో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా లైంగిక ఆసక్తి కోల్పోతారు.

మరికొన్ని కారణాలు ….

Image result for wife and husband not interested in sex reasons and solutions

**కటి ప్రదేశంలో సర్జరీ జరగటం
**లైంగిక హింస
**స్థూలకాయం
**వ్యసనాలు
**మానసిక వ్యాధులకు తీసుకునే మందులు
**హైపర్‌టెన్షన్‌
**హృద్రోగాలకు ఉపయోగించే మందలు
**మధుమేహం
**నరాల సమస్యలు
**వెన్నుముక సమస్యలు
**పుట్టుకతో జననాంగంలో ఉండే బర్తోలిన్‌ గ్రంథులు దెబ్బతినటం
** దాంపత్యం సంతృప్తికరంగా లేకపోవటం, ఆరోగ్యం అనుకూలించకపోవడం, దాంపత్య జీవితం ఆనందకరంగా లేకపోవడం లాంటి పలురకాల శరీరక, మానసిక అంశాలు దోహదపడతాయి
**ముఖ్యంగా లైంగికాసక్తి లోపానికి శారీరకమైన కారణాలకంటే మానసికమైన సమస్యలే…
***ఫోర్‌ ప్లే లేకపోవటం
***భాగస్వామి మీద ఆసక్తి సన్నగిల్లడం
***దంపతుల మధ్య ప్రేమ, సఖ్యత కొరవడటం,
***విపరీతమైన ఆర్థికపరమైన, వృత్తిపరమైన, కుటుంబపరమైన ఒత్తిడి
***భాగస్వామి మీద అయిష్టత ఏర్పడటం
***అవతలి వ్యక్తిలో లైంగిక సామర్ధ్యం లోపించటం.
***కుటుంబ కలహాలు
***దంపతుల మధ్య మానసిక దూరం పెరగటం
చికిత్స……
***ఈ రకం సమస్య కి ఇచ్చే చికిత్స పలు కారణాలపై ఆధారపడి ఉంటుంది. మానసిక కారణాల వల్ల ఆసక్తి లోపిస్తే అందుకు కౌన్సిలింగ్‌, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ ఇస్తారు. ఒకవేళ శారీరక కారణాలవల్లే సెక్స్‌ పట్ల ఆసక్తి లోపిస్తే అందుకు మందులున్నాయి. శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ను సహజసిద్ధంగా పెంపొందించే నోటి మాత్రలు, జెల్‌లు, లూబ్రికేటింగ్‌ క్రీమ్‌లను వైద్యులు సూచిస్తారు.

లైంగికాసక్తి పెరగాలంటే…

  • ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపించే సోయా ఉత్పత్తులు రోజూ తీసుకోవాలి.
  • చీజ్‌ బదులుగా టోఫు తినాలి.
  • విటమిన్‌ ఇ, సి ఉన్న ఆహారం తీసుకోవాలి.
  • లైంగిక ఉద్రేకం పొందటంలో రక్త ప్రసరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రక్త వృద్ధిని పెంచే ఆకుకూరలు, దానిమ్మ పండ్లు తినాలి.
  • ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఫిష్‌ ఆయిల్‌ తీసుకోవాలి.
  • జననావయవాల దగ్గర వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌తో మర్దనా చేయాలి.
  • క్రమం తప్పక యోగా, ప్రాణాయామం చేసినా ఫలితం ఉంటుంది.
  • చక్కటి శరీరాకృతినిచ్చే వ్యాయామాలు చేయాలి….

Leave a Reply