నాగ్ వద్దన్న కధలో బాలయ్య,మోక్షు?

0
559
will balakrishna mokshagna accept with nagarjuna rejected story

Posted [relativedate]

will balakrishna mokshagna accept with nagarjuna rejected story
శతమానంభవతి సినిమా భారీ విజయం తర్వాత ఆ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న చెప్పిన మరో కధకి దిల్ రాజు ఫ్లాట్ అయిపోయాడట.ఇది శతమానంభవతికి మించిన కథ అంటూ తెలిసిన వాళ్లందరికీ చెప్పి మురిసిపోతున్నాడంట.తండ్రీకొడుకుల కథతో తెరకెక్కే ఈ సినిమా కోసం ముందుగా నాగార్జున,నాగచైతన్య ని అనుకున్నా నాగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇక ఆ కధకి బ్రేక్ పడినట్టే అంటున్నారు.ఆ దశలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తోంది.

అదిరిపోయే ఈ కధకి బాలయ్య ,ఎన్టీఆర్ అయితే సూపర్ గా సూట్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.అయితే ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ కావడం కష్టమని తెలిసి మరో ఆలోచన చేస్తున్నారట.బాలయ్య,మోక్షజ్ఞ కాంబినేషన్ లో ఈ సినిమా చేస్తే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చారట.అందుకే త్వరలో ఈ కథతో బాలయ్య దగ్గరికి వెళ్లేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.బాలయ్యకి ఈ కథ నచ్చితే తండ్రీకొడుకుల కాంబినేషన్ లో సినిమా ఖాయమైనట్టే.

Leave a Reply