Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ స్థాయిలో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాను అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తాలకు కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం జరిగింది. దాంతో నిర్మాత నాగార్జున భారీ మొత్తాలకు ఈ సినిమాను అమ్మి మంచి లాభాలను దక్కించుకున్నాడు. కేవలం 15 కోట్లలోపు బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించి 25 కోట్లకు పైగా అన్ని ఏరియాల్లో ఈ సినిమాను అమ్మాడు. గతంలో నాగచైతన్య నటించిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో బిజినెస్ చేసింది లేదు.
తాజాగా విడుదలైన సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కించుకుంటుంది. విడుదలైన మొదటి రోజు పర్వాలేదు అన్నట్లుగా కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. కాని ఈ టాక్‌తో సినిమా భారీ వసూళ్లను సాధించడం కష్టమే అంటున్నారు. ఈ వారం రోజుల తర్వాత ఇంకా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దాంతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా 10 నుండి 12 కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించే అవకాశం ఉంది. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు 13 కోట్ల మేర నష్టం తప్పేలా లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చైతూ గత చిత్రాలు, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గత చిత్రం దృష్ట్యా ఈ సినిమాను ఇంత భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసినందుకు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే నాగార్జున మాత్రం దాదాపు 15 కోట్ల లాభాన్ని ఈ సినిమా ద్వారా తన ఖాతాలో వేసుకున్నట్లుగా తెలుస్తోంది.