వింటర్… కేర్ ..ఇలా

0
401
winter skin care

Posted [relativedate]

winter skin careఉదయం సాయంత్రం తేడా లేకుండా చల్లటి గాలులు దానికి తోడు వర్ద ఎఫెక్ట్ వాతావరణం చల్లగా ఉంటోం ది. వైరస్‌ల కారణం గా జబ్బులు చుట్టుముడుతాయి. ఆస్తమా, సీవోపీడీ, న్యుమోనియా, స్వైన్‌ఫ్లూ వంటి జబ్బులు మ హిళలు, వృద్ధులు, పిల్లలకు మరింత గడ్డు గా వుంటుంది ఇలాంటి వాతావరణం

శరీరంలో తేమ శాతం తగ్గిపోవడంతో చల్లటి ప్రదేశంలో బయట కు వెళ్లినా సమస్యే. కాస్తా ఎండ తీక్షణలో తిరిగినా ఇబ్బందే.ఇటువంటి వాతావరణంతో ఎంతంటి వారికైనా ఇబ్బందులు తప్పవు. పెదవులు పగిలిపోయి ముఖం కాంతి హీనంగా మారుతుంది. అరికాళ్లు పగిలి ఇబ్బంది పడు తుంటారు. ముఖం పొడిబారిపోవడం వల్ల పగుళ్లు ఏర్పడటం తప్పదు.

తేమ తగినంత లేకపోవడం వల్ల హోర్మన్లకు సంబంధించిన సమస్యలు మహిళల్లో ఉంటాయి. మధు మేహం, థైరాయిడ్‌ ఉన్న వారికి పరీక్ష కాలమే.
అస్తమా, స్వైన్‌ఫ్లూ తీవ్రత పెరుగుతాయి. రైనో వైరస్‌, ఇన్‌ఫ్లూంజా, ఫ్లూ వైరస్‌ దాడి చేసే ప్రమాదం ఉంది. శ్వాసకోశ సమస్యలున్న వారు చలికాలంలో తిరగవద్దు. ఆస్తమా బా ధితులు తప్పని సరిగా ఇన్‌హేలర్‌ వినియోగించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఇంటిలో రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. చల్లటి పదార్థాలు తీసుకోవద్దు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి డస్ట్‌, స్మోకింగ్‌, లంగ్‌, స్కిన్‌ ఎలర్జీ సమస్యలు ఉంటాయి.దగ్గు, జలుబు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదముంది. అస్తమా, న్యుమోనియాతో బాధపడే వారు మందులను వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశముంది. బాగా వేడి, చల్లటి నీళ్లు కాకుండా గోరువె చ్చనీటితో స్నానం చేయాలి.
వే

  • డినీటితో తలస్నానం చేయొద్దు. జుట్టును వదులుగా ఉంచుకోవాలి.
  • సబ్బుల కన్నా సున్నిపిండి, శనగపిండిని ఉపయోగించడం మేలు.
  •  సబ్బు వాడడం తప్పనిసరైతే గ్లిసరిన్‌ సబ్బు లను మాత్రమే వినియోగించాలి.
  •  హెయిర్‌ కండిషనర్‌ తప్పనిసరిగా వాడాలి.
  •  కళ్లు, పెదాలపై మాయిశ్చరైజ్‌ తప్పనిసరి చేయాలి.
  •  రోజుకు రెండు సార్లు చేతులకు నూనే రాయాలి.
  • పెదవులకి లిప్‌క్రీమ్‌ వినియోగించాలి.

Leave a Reply