ఆ కమెడియన్ తో రిసెప్షనిస్ట్‌ సహజీవనం… కేసు?

Posted October 10, 2016

 lady cheating case 30 years prudhvi

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ 30ఇయర్స్ పృధ్వీ చిక్కుల్లో పడ్డాడు. పృధ్వీ తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఓ మహిళా పోలీసులని ఆశ్రయించింది.
దీంతో.. పృధ్వీపై 498ఏ, 420 సెక్షన్ల క్రింద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కొంతకాలంగా పృథ్వీరాజ్ రోడ్ నంబర్ 14లోని నందినగర్‌లో
కార్యాలయం నిర్వహిస్తున్నారు. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన మహిళతో(30) సహజీవనం
చేస్తున్నాడు.

పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పాటు, తనపై వేధింపులకి గురి చేస్తున్నాడని సదరు మహిళా పోలీసులని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు పోలీసులు పృథ్వీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ లో పృధ్వీ బిజీ కమెడియన్. ఈ మధ్య ప్రతి సినిమాలో హల్ చల్ చేస్తున్నాడు. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం హవా కాస్త తగ్గిన తర్వాత
పృధ్వీ హవా మరింతగా పెరిగింది. ఇప్పుడిప్పుడు స్టార్ కమెడియన్ ఎదుగుతోన్న పృధ్వీకి తాజా చీటింగ్ కేసు చేటు చేసేదే.

SHARE