ఇక మహిళలకూ శబరిమల ప్రవేశం..

women-allowed-in-sabarimala-temple
కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.శబరిమలపై కొలువైన అయ్యప్పని దర్శించుకోడానికి మహిళలని కూడా అనుమతిస్తామని సుప్రీమ్ కోర్ట్ కి తెలిపింది.మహిళల వయసు విషయంలోనూ ఇక ఎలాంటి నిబంధనలు విధించబోమని అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది.శబరిమలకు మహిళలని అనుమతించాలన్న డిమాండ్ కి ఎట్టకేలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇంతకు ముందు 10 ఏళ్ల లోపు బాలికలు,50 ఏళ్ళు దాటిన మహిళలకి మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉండేది.
ఇంతముందు ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీమ్ కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

‘దేవుణ్ణి పూజించడానికి ఎక్కడైనా అర్హతలు ఉంటాయా? అసలు దేవుడికి భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా? కులం,మతం,లింగ భేదాల్ని దేవుడు పాటిస్తాడా? ఏ ప్రాతిపదికపై ఆలయానికి మహిళలు రాకుండా అడ్డుకుంటున్నారు ? దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు స్త్రీ,పురుష భేదాలు ఆయనకి ఉంటాయా?’.కోర్టులు,మహిళా సంఘాల నుంచి ఇలాంటి వాదనలు బలంగా వినిపించడంతో కేరళ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.దీంతో శబరిమల వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు మహిళలకి మార్గం సుగమం అయ్యింది.

SHARE