మాటల యుద్ధం …

0
417

 words war loksabha

అంతా మీరే చేశారని విపక్షాలు.. మేం ఎలాంటి తప్పు చేయలేదని సర్కారు.. మాటకు మాట.. అటాక్ కు కౌంటర్ అటాక్.. దళితులపై జరుగుతున్న దాడులపై చర్చ సందర్భంగా లోక్ సభలో పరిస్థితి ఇది. సర్కారు మాటలకే పరిమితమైందని.. దాడులు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విపక్షాలు ఫైరయ్యాయి. పొలిటికల్ మైలేజ్ కోసమే విపక్షాలు తమపై ఆరోపణలు చేస్తున్నాయని కేంద్రమంత్రులు విమర్శించారు.

సీపీఎం ఎంపీ పీకే బిజు చర్చ ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు విపక్ష నేతలు. గోరక్షా సేవకులు సంఘవిద్రోహ పనులు చేస్తున్నారని స్వయంగా చెప్పిన మోడీ.. వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని కమిషన్లు వేసినా.. పరిస్థితులు మారడం లేదన్నారు.కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘవాల్ ను మాట్లాడాలని డిప్యూటీ స్పీకర్ పిలిచినప్పుడు ఆయన తన సీట్ లో లేరు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం జరిగింది. ముఖ్యమైన విషయంపై చర్చ జరుగుతోంటే.. కేంద్రమంత్రి బయటకు వెళ్లిపోవడంపై కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు.

కేంద్రమంత్రులు దీనిపై కౌంటర్ అటాక్ కు దిగారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి కాసేపు బయటకు వెళ్తే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.చర్చకు సమయం సరిపోలేదని.. టైం పొడిగించాలని ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు. సభ్యుల రిక్వెస్ట్ కు ఓకే చెప్పిన స్పీకర్.. సభాసమయాన్ని గంటసేపు పొడిగించి చర్చించారు.ళితులకు ప్రధాని సానుభూతి అవసరం లేదన్నారు బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి. దళితులపై దాడుల అంశంపై నేడు లోకసభలో జరిగే చర్చలో ప్రధాని మోడీ మాట్లాడాలని మాయావతి డిమాండ్‌ చేశారు.

సానుభూతి వల్ల ఏమీ కాదని, రాజ్యాంగ హక్కులను కాపాడుతామని హామీ ఇవ్వాలన్నారు. గుజరాత్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ గో సంరక్షణ పేరుతో దళితులపై దాడులు జరిగాయి. దీంతో ఎన్ డి ఏ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో విపక్షాలు మండిపడ్డాయి. అయితే ఈ ఘటనలపై ఇటీవల ప్రధాని మోడీ స్పందించారు. తెలంగాణలో ఓ సభలో మాట్లాడుతూ.. దళితులను కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి.. వారిని చంపాలనుకుంటే నన్ను చంపండని వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో నరేంద్రమోడీ స్పందనపై బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply