నేడు…”ప్రపంచ జల దినోత్సవం”  విశేషాలు ..!!

 Posted March 22, 2017

World Water Dayప్రపంచ జల దినోత్సవమును  ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 22 గా ప్రకటించడంతో 1993 నుండి ప్రతి సంవత్స రం మార్చి 22 న జరుపుకుంటున్నారు.

▪ఈ దినోత్సవమును మొదట లాంఛనప్రాయం గా రియోడి జనీరో, బ్రెజిల్ లో పర్యావరణం మరియు అభివృద్ధి పై 1992 ఐక్యరాజ్య సమితి సమావేశం (UNCED)యొక్క ఎజెండా 21 లో ప్రతిపాదించబడింది. 1993 లో ప్రారంభమైన ఈ పాటింపు అప్పటి నుండి గణనీయంగా అభివృద్ధి చెందింది; సాధారణ ప్రజలకు అవగాహనరేకెత్తించేందు కోసం, నీటి ప్రాధాన్యతను తెలియజేసేందుకు పాటిస్తారు.

▪మనం నివసించే భూగోళంలో 70 శాతానికి పైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ,చెట్టు,చేమలలోవుంటుంది.

▪ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడ గలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే.

▪ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే,పరిశుభ్ర మైన నీటిలో, 1 % కంటెకూడా తక్కువ పరిమాణంలో, ( లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.007 % మాత్రమే) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయో గపడుతుంది.

▪ప్రతిరోజూ , మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కాని, ఇప్పటికీ, 88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

▪ప్రపంచవ్యాప్తంగా, ప్రతిఏటా , 1,500 ఘన కిలోమీటర్ల పరిమాణంలో, వ్యర్ధమైన నీరు వస్తుంటుంది. వ్యర్ధ పదార్ధాలను, వ్యర్ధమైన నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా, ఇంధనోత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. కాని, సాధారణంగా , అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్ధాలను పునర్వి నియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. ఇదే దామాషాలో, పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా, ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి , పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచివుండగా ; తాగడానికి ఉపయో గపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికి, నీటి కాలుష్యం ‘అత్యవసరంగా దృష్టిసారించ వలసిన అంశం’ అనే ప్రస్తావన, అరుదుగా కాని రావడంలేదు.

MGL ఆంజనేయులు 

SHARE