అమ్మకాలలో ‘యాహూ’ అనిపించలేదు…

0
243

yahoo1

ఇంటర్నెట్ ను ఒకప్పుడు శాసించిన యాహూ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. అమెరికా టెలికామ్ దిగ్గజం వెరిజాన్ కమ్యునికేషన్స్ – యాహూను 4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 20 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా సేవలందించిన యాహూ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఇతర ఆస్తులన్నీ ఇక వెరిజోన్ వశమవుతాయి. యాహూని కొనడానికి 44 బిలియన్ డాలర్లు ఇస్తామని 2008లోనే మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించింది యాహూ యాజమాన్యం. డాట్ కామ్ పతనానికి ముందు యాహూ విలువను 100 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

అయితే యాహూ క్యాష్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌లోని దాని షేర్లు, యాహూ జపాన్‌లోని దాని షేర్లు, యాహూ కన్వర్టబుల్ నోట్స్, కొన్ని మైనారిటీ పెట్టుబడులు, యాహూ నాన్-కోర్ పేటెంట్స్ ఈ కొనుగోలు ఒప్పందం పరిధిలోకి రావు. ఇవన్నీ కూడా ఇకపైనా యాహూ నిర్వహణలోనే ఉంటాయి. ఈ మేరకు ఓ ప్రకటన స్పష్టం చేసింది.

కాగా, వెరిజోన్‌తో జరిగిన ఒప్పందానికి యాహూ భాగస్వాముల నుంచి రెగ్యులేటరీ, ఇతరత్రా అధికార విభాగాల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికల్లా (2017 మార్చి నాటికి) ఈ వ్యవహారం పూర్తవుతుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. అప్పటిదాకా యాహూ స్వతంత్రంగానే నిర్వహించబడుతుంది. యూజర్లకు, ప్రకటనకర్తలకు, భాగస్వాములకు, డెవలపర్లకు సేవలను యాహూ అందిస్తుంది. ‘ఏడాది క్రితం అడ్వర్టైజర్లు, క్రియేటర్లు, కన్జ్యూమర్లకు క్రాస్ స్క్రీన్ కనెక్షన్ అందించడం కోసం ఎఒఎల్‌ను కొనుగోలు చేశాం. ఇప్పుడు యాహూ కొనుగోలుతో ఎఒఎల్‌కు కలిసిరానుంది.

అంతేగాక ప్రపంచంలోనే ఓ అత్యున్నత మొబైల్ మీడియా సంస్థగా ఎదగడానికి అవకాశముంది.ఈ డీల్ పై తాము సంతోషంగా ఉన్నామని యాహూ సీఈవో మారిసా మేయర్ తెలిపారు. ఆన్ లైన్ లో యాహూ ఇప్పటికీ ప్రబల శక్తే అయినా… కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేయడంలోనూ, ఆధునీకీకరణలోనూ ప్రత్యర్థుల(గూగుల్) కంటే వెనకబడటంతో ప్రాభవం తగ్గింది.

Leave a Reply