Posted [relativedate]
యనమల రామకృష్ణుడు, ఏపీ ఆర్ధిక మంత్రి
- బడ్జెట్ పై ప్రిపరేషన్ చివరి దశలో ఉంది.
- బడ్జెట్ పై మంత్రులతో భేటీ నిర్వహిస్తాం.
- ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు మంత్రులతో భేటీలు నిర్వహిస్తాం.
- చివరి మూడేళ్ళల్లో శాఖల వారీ ఖర్చును పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ కేటాయింపులను చేయనున్నాం.
- ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటూ రెవెన్యూ అంచనాలు లెక్కగట్టనున్నాం. రూ. 1.14 లక్షల మేర రెవెన్యూ ఖర్చు ఉంది.. రెవెన్యూ ఖర్చులను తగ్గించుకుంటాం.
- రెవెన్యూ లోటు మరింత పెరగ్గకుండా చర్యలు తీసుకుంటాం.
- ఎఫ్ ఆర్ బి ఎం పరిధికి వెసులుబాటు కలిగే అవకాశాలు ఉన్నాయి.
- కేంద్ర బడ్జెట్టును ముందుగానే పెడుతుండడంతో రాష్ట్ర బడ్జెట్ రూప కల్పన తేలికవుతుంది.
- ఈ ఏడాది సుమారు రూ.24 వేల కోట్లు అప్పులు చేశాం.
- మార్చి మొదటి వారంలో బడ్జెట్ ప్రవేశపెడతాం.
- శాఖలన్నీ ఆర్ధిక క్రమశిక్షణ పాటించాల్సిందే.