యండమూరి రూట్ మారిందా?

Posted September 27, 2016

 yandamuri veerendranath rout change
ఫిక్షన్,నాన్ ఫిక్షన్ ఈ రెండు చోట్ల విజయపతాకం రెపరెపలాడించిన ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రూట్ మారిందా? వయసు పెరిగే కొద్దీ సేవ రంగం గురించి ఎక్కువ మాట్లాడుతూ వస్తున్నారు ఈయన.అవకాశం దొరికినప్పుడల్లా కాకినాడ దగ్గర ఏర్పాటు చేసిన సరస్వతి విద్యాపీఠం ,విద్యార్థులు, యువత గురించి ప్రస్తావిస్తున్న అయన కొన్నేళ్ల కిందట వరకు ఆధ్యాత్మిక భావనలకు దూరంగానే వుంటూ వచ్చారు.భగవద్గీతలో సైతం వ్యక్తిత్వ వికాస వాదాన్ని చూసిన ప్రాక్టికల్ రచయిత అయన.మంత్రాల గురించి కూడా అయన అభిప్రాయం భిన్నమే.వాటి పఠనం వల్ల మేలు జరుగుతుందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.

అలాంటి మనిషి ఈమధ్య కాస్త రూట్ మార్చుకున్నట్టున్నారు.గెలవడం,ఎదగడం గురించి మాత్రమే మాట్లాడిన,రాసిన అయన ఇటీవల కందుకూరి రమేష్ బాబు అనే రచయిత రాసిన సామాన్య శాస్త్రం గురించి పాజిటివ్ వ్యాఖ్యానం చేశారు.మెదడు కాకుండా మనసుతో రాసిన పుస్తకమది.జీవితం గెలవడానికి మాత్రమే కాదు జీవించడానికి కూడా అని చెప్పిన పుస్తకాన్ని గురించి బాగా మాట్లాడ్డం యండమూరిలో వచ్చిన,వస్తున్న మార్పుకి మరో సంకేతం.

 yandamuri veerendranath rout change
ఇంతలో ఏమైందో ఏమో ..ఫేస్ బుక్ లో అయన పరోక్షంగా భక్తిని,తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ఓ పోస్ట్ పెట్టారు.తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు.ఓ పిల్లవాడి తరహాలో ఆ పోస్ట్ మార్చి చూసారు.అప్పటికే జరగాల్సిన నష్టం జరగడం తో క్షమాపణలు చెప్పి పోస్ట్ తొలగించారు.యండమూరి ఇలా చేయడమే చిత్రం.తిరుపతి విమాన ప్రమాదం గురించి రాస్తూ చిరంజీవి కన్నీరు పెట్టుకున్న ,భయపడ్డ విషయాన్ని ఓ పుస్తకంలో ప్రస్తావించారు.చిరంజీవి దానికి హర్ట్ అయినా అయన పట్టించుకోలేదు.అలాంటిది సోషల్ మీడియా లో వచ్చిన విమర్శలకే వెనక్కుతగ్గారు.ఆ వెంటనే పెద్దగా సందర్భ శుద్ధి లేని ఓ పోస్ట్ అది కూడా బౌద్ధం గురించి పెట్టారు.ఇవన్నీ చెప్పడం ఆయన్ను విమర్శించడానికో ..విశ్లేషించడానికో కాదు..ఎందుకో అయన రూట్ మారుతోందని చెప్పడానికి మాత్రమే!అది వయసుతో వస్తున్న మార్పా ?లేక సామాజికంగా మానసిక పరిణితి విషయంలో శిఖరం ఎక్కాక వచ్చే ఒంటరితనం ప్రభావమో ?ఈ విషయాన్ని మన కన్నా రూట్ మార్చుకున్న యండమూరి బాగా విశ్లేషించగలరు.విడమర్చి చెప్పగలరు ..ఈ పనికి అయన పూనుకుంటేనే బాగుంటుంది.

SHARE