కూల్ గా బాబుని ఐస్ చేసిన యరపతినేని..


గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరోసారి సీఎం చంద్రబాబుని ఇంప్రెస్ చేసాడు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దొరకని వాళ్లంతా చంద్రబాబు వద్ద సెంటిమెంట్,ఎమోషన్ సీన్స్ పండించేశారు.ఇక క్యాబినెట్ లో చోటు కోల్పోయిన వాళ్ళు చేసిన రాద్ధాంతం అంతాఇంతా కాదు.కానీ యరపతినేని శ్రీనివాసరావు మాత్రం వీటన్నిటికీ దూరంగా వున్నారు.అధిష్ఠానం పరిస్థితి చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా మీ అవకాశాన్ని బట్టి నిర్ణయం తీసుకోమని కూల్ గా భరోసా ఇచ్చారు. ఏమి జరిగినా తాను జీవితాంతం టీడీపీ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.ఈ ఎపిసోడ్ లు కొనసాగే టైం లోనే చంద్రబాబు కి ఎదురు పడ్డారు యరపతినేని.క్యాబినెట్ వ్యవహారంలో యరపతినేని వైఖరిని బాబు మెచ్చుకున్నారు.పార్టీ ఇబ్బంది అర్ధం చేసుకుని వ్యవహరించినందుకు ప్రశంసలు కురిపించారు.అంతే కాదు భవిష్యత్ లో మీకు ఏ అవసరం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు .ఈ సీన్ చూసిన ఓ పెద్దాయన యరపతినేని కూల్ గా బాబుని ఐస్ చేసాడని కామెంట్ చేసాడు

అయితే యరపతినేని వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరించడానికి వీల్లేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో వున్నప్పుడు దాన్ని తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేయడం ఆయనకి అలవాటే. రాష్ట్ర విభజన టైం లోటీడీపీ కి ఓ భారీ సవాల్ ఎదురైంది.ఓ వైపు విభజనకి అనుకూలంగా లేఖ ఇచ్చారని ఏపీ లో బాబు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.మరో వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పార్టీ సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉండటంతో ఆర్ధిక వనరుల సమస్య కూడా వుంది.ఆ పరిస్థితుల్లో జనాల్లోకి వెళ్లాలని బాబు భావించారు.అయితే ఆ బాధ్యత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు.ఆ టైం లో యరపతినేని ముందుకొచ్చి పల్నాడులో బాబు యాత్ర దిగ్విజయం అయ్యేలా చూసారు.అదే యాత్ర ఆ తర్వాత కాలంలో టీడీపీని అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు కూడా మంత్రి పదవి కోసం పోటీపడ్డ వాళ్లంతా బాబు మీద ఒత్తిళ్లు తెస్తే యరపతినేని మాత్రం కూల్ గా ఆయన్ని ఐస్ చేశారు.

SHARE