జర్నలిస్టుల కష్టం తీర్చిన టీడీపీ ఎమ్మెల్యే..

0
614
yarapathineni srinivasa rao To set up water tea and meals to journalist

Posted [relativedate]

yarapathineni srinivasa rao To set up water tea and meals to journalist
అమరావతి లో తొలి అసెంబ్లీ సమావేశాలు ఎంత ఘనంగా ప్రారంభం అయ్యాయో అందరం చూశాం.ఆ విషయాల్ని,విశేషాల్ని బయటకు తీసుకొచ్చిన జర్నలిస్టులు మాత్రం నానా కష్టాలు పడుతున్నారు.వార్తా సేకరణకు సంబంధించి వారి కోసం ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ దగ్గర కనీస ఏర్పాట్లు లేకపోవడంతో విలేకరులు పడ్డ అగచాట్లు అన్నీఇన్నీ కావు.కొన్ని సందర్భాల్లో తాగు నీటికి కూడా జర్నలిస్టులు ఇబ్బంది పడ్డారు.ఈ పరిస్థితి ఆనోటాఈనోటా పడి దేశం ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావు దగ్గరికి చేరింది.ఆయన వెంటనే స్పందించి జర్నలిస్టుల కోసం సొంతంగా మంచినీరు,తేనీరు,అల్పాహారం,భోజనం వంటి ఏర్పాట్లు చేయడానికి ముందుకొచ్చారు.రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే యరపతినేని ఇలాంటి విషయాల్లోనూ చొరవగా ఉండటం విశేషమే.

Leave a Reply