Posted [relativedate]
పల్నాడులో పులివెందుల రాజకీయాలు చేయొద్దని గురజాల ఏం ఎల్ ఏ యరపతినేని శ్రీనివాసరావు జగన్ కు హితవు చెప్పారు.చెన్నాయపాలెం ఘటనతో జగన్కు సంబంధం ఉందా లేదా… ఉంటే రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి లేదా స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి 400 మంది కిరాయి రౌడీలను తీసుకొని చెన్నాయపాలెం పచ్చని పంటపొలాలపై మారణాయుధాలతో దాడిచేసి, పెట్రోలు బాంబులు వేసి, మహిళలపై ధౌర్జన్యం చేయడం జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు .
ఫ్యాక్టరీ నిర్మిస్తామని భూములు కొనుగోలుచేసి.. గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటుచేసి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి సారవంతమైన భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి మోసం చేసింది సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కాదా అని . భూములు కొనుగోలు చేసిన మూడు సంవత్సరాలకే ఫ్యాక్టరీ నిర్మిస్తామని నమ్మబలికి ఇప్పటికైనా ఫ్యాక్టరీ నిర్మిస్తే చెన్నాయపాలెం రైతులతో మాట్లాడి దగ్గరుండి భూములు ఇప్పిస్తానని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా వైఎ్స జగన్మోహన్రెడ్డి కావడం ఆంధ్ర రాష్ట్రానికి దౌర్భాగ్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాత్రనక, పగలనక నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కోసం కృషి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిపోయి ఆరోపణలు చేయడం ఎంతవరకు సంజసం అంటున్నారు యరపతినేని ..