ఏడు పెళ్లిళ్లు చేసుకున్న వగలాడి..

 Posted October 21, 2016

yasmin banu married 7 other peoples
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లాడింది ఓ కన్నడ వగలాడి.కెజిహళ్లి వాసి యాస్మిన్ భాను.వయసు 38. తొమ్మిదేళ్ల కిందట ఇమ్రాన్ ని ప్రేమించి పెళ్లాడింది .ఇద్దరు పిల్లలు పుట్టాక ఓ రోజు ఇంట్లో ఉన్న 10 లక్షలు తీసుకుని ఉడాయించింది.ఆ డబ్బు అయిపోగానే శ్రీమంతుల్ని బుట్టలో వేసుకుని పెళ్ళాడ్డం …కొన్నాళ్లకి వారిని బెదిరించి ఎంతోకొంత తీసుకుని వెళ్లడం ఆమెకి అలవాటుగా మారింది.ఇలా ఏడుగురిని పెళ్ళాడి మోసం చేసిన వగలాడి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది.అంతకన్నా విశేషం ఆమె మూడో భర్త కూడా ఆమెతో చేతులు కలిపి పోలీసులకి చిక్కడం.

ఇటీవల మూడో భర్త సాయంతో డబ్బు కోసం నాలుగో భర్తని వేధించడం మొదలుపెట్టింది యాస్మిన్.దీంతో అతను ఫిర్యాదు చేయడంతో వగలాడి లీలలు ఒక్కోటి బయటికొచ్చాయి.ఈ కేసుని చూసి పోలీసులే అవాక్కవుతున్నారు.
marriage

SHARE