వైసీపీ క్రియేటివ్ డైరెక్టర్స్ మారాలి..

 Posted November 4, 2016

ycp creative directors should change
ఏపీలో ప్రతిపక్ష వైసీపీ మీద టీడీపీ తరచూ చేసే ఆరోపణ ఒకటుంది.వైసీపీ నిరంతరం అభివృద్ధికి అడ్డు పడుతోందని,నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా విధ్వంసక ఆలోచనలు చేస్తుందని దేశం నేతలు విరుచుకుపడుతుంటారు.అందులో నిజానిజాలెలా వున్నా తాజాగా రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు చూస్తే వైసీపీ లో కాస్త క్రియేటివిటీ ప్రాబ్లం ఉందనిపిస్తోంది. చంద్రబాబు అవినీతి మీద వైసీపీ ..జగన్ అవినీతి మీద టీడీపీ కొత్త కొత్త వ్యాఖ్యానాలతో చెలరేగిపోవడం అందరికీ తెలిసిందే..
ఇప్పుడు మరోసారి బాబు,జగన్ అవినీతి వ్యవహారాల్ని ఇరు పార్టీల నేతలు ప్రెస్ మీట్ ల సాక్షిగా తవ్వుకున్నారు.విజయవాడ కి చెందిన దేశం నేత,ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జగన్ ఆస్తుల చిట్టా మీద ప్రెస్ మీట్ పెట్టారు.అయన అవినీతి సొమ్ముని పంచితే ఒక్కో నియోజకవర్గానికి 750 కోట్లు వస్తుందని చెప్పారు.ఆ విధంగా జగన్ దగ్గర ఉన్న ఆస్తుల గురించి జనానికి ఓ ఐడియా వచ్చేలా ప్రయత్నించారు. ఇక చంద్రబాబు అంటే విరుచుకుపడే వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ గా ఇటీవల ఓ మాట వినిపిస్తున్నారు.చంద్రబాబు దగ్గరున్న డబ్బుని కాలిస్తే ఒక మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భూమన విమర్శిస్తున్నారు. ఇక్కడ డబ్బుని కాల్చడం అన్న పాయింట్ వైల్డ్ గా వుంది .సర్లే పోనీ అనుకుంటే దాని వల్ల ఓ మెగావాట్ కరెంటు పుడుతుంది అంటే అదెంత అనేది సామాన్యులకి ఏమి అర్ధమవుతుంది? పైగా జనానికి డబ్బు పంచడమంటే ఎక్కినంతగా కాల్చేద్దామంటే ఎక్కుతుందా? వైసీపీ నాయకులూ కాస్త ఆలోచించుకోండి.మీ క్రియేటివ్ డైరెక్టర్ లు అయినా మారాలి లేదా వాళ్ళ ఆలోచనలైనా మార్చుకోవాలి!

SHARE