పవన్ ఆఫర్ వైసీపీకి నచ్చలేదా?

0
550
ycp dont like pawan offers

Posted [relativedate]

ycp dont like pawan offers
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశంలో ఎవరితో అయినా కలిసి పనిచేస్తామని..అందుకు వైసీపీ అయినా అభ్యంతరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆఫర్ వేస్ట్ అవుతోందా? ఆ ఆఫర్ వాడుకోడానికి వైసీపీ సిద్ధంగా లేదా ? ఈ రెండు ప్రశ్నలకి ఎస్ అనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.వైసీపీ కి దూరంగా ఉండేందుకు పవన్ ప్రయత్నించినప్పుడు ఆయన కలిసొస్తే ప్రత్యేక హోదా ఉద్యమం చేద్దామని వైసీపీ నేతలు ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. ఇక జగన్ సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ఇదే విషయమై పవన్ కి బహిరంగ పిలుపులు పదేపదే ఇచ్చారు.అప్పుడు ఆ పిలుపు వినీవిననట్టున్న పవన్ తాజాగా ఓ ఆఫర్ మీడియా ముందే ఇచ్చారు.ప్రత్యేక హోదా కోసం పోరాడే అందర్నీ ఒక్కతాటి మీదకి తెచ్చే శక్తి తనకు లేదని ..అలా వైసీపీ సహా ఎవరు ముందుకొచ్చినా తానూ కలిసి పనిచేస్తానని చెప్పారు.ఒకప్పుడు దీని కోసమే ఆరాటపడ్డ వైసీపీ వెంటనే ఆ ఆఫర్ వాడుకోడానికి ఓ మెట్టు కిందకు దిగుతుందని అంతా భావించారు.ఆ ప్రయత్నాలేమీ జరగక పోగా రివర్స్ లో వచ్చారు ఓ వైసీపీ నేత.విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్.

ప్రత్యేక హోదా అంశంలో ట్వీట్స్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు సంధించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాధ్.హోదాకి సంబంధించి పదేపదే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని తప్పుబట్టే పవన్ ఆ విషయంలో సీఎం చంద్రబాబుని ఎందుకు నిలదీయడం లేదని అమర్నాథ్ ప్రశ్నించారు.అంటే ప్రత్యేక హోదాకి బాబు అనుకూలమని భావిస్తున్నారా అని పవన్ మీద ఎదురుదాడి చేశారు.ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని పవన్ ని అమర్నాధ్ డిమాండ్ చేశారు. అంటే హోదా పోరాటం లో పవన్ ఆఫర్ ని పక్కనబెట్టి ఆయనతో బాబుని తిట్టించడం ఇదే వైసీపీ దృష్టి పెట్టినట్టుంది.పైగా ఇంతటి కీలక అంశం మీద ఓ యువనేతని ప్రయోగించడం ద్వారా పవన్ కి తాము ఏ మాత్రం ప్రాధాన్యం ఇస్తారో చెప్పకనే చెప్పింది వైసీపీ.దీన్ని బట్టి చూస్తే పవన్ ఆఫర్ వైసీపీ కి నచ్చలేదని వేరే చెప్పాలా ?

Leave a Reply