YCP నష్టం …జోస్యులకు లాభం

 ycp jagan loss archaeologist profitYCP అధినేత జగన్ భవిష్యత్ వ్యూహం ఖరారు చేస్తున్నారు.అయితే ఆ వ్యూహం లో పాలుపంచు కొంటోంది సహచర ఎమ్మెల్యేలు, అంటిపెట్టుకొని వుండే అనుంగు అనుచరులు కాదు జోస్యులు….వింటానికి కాస్త కష్టంగా ఇంకాస్త కామెడీగా వున్నాఇదే నిజం….ఈడీ ఆస్తుల అటాచ్ మెంట్ వార్త జగన్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది.దీంతో ఆయన ఎవర్నీ కలవడానికి పెద్ద ఆసక్తి చూపలేరు.కానీ ఆస్థాన జోతిష్యుల్ని మాత్రం ఇంటికి పిలిపించుకొన్నారు.మీరు చెప్పిందేంటి?జరిగేదేంటి ?అని వారిని అడిగి ఉండొచ్చు.

ఇంతకీవీళ్ళు ఆయనకు ఏం చెప్పారో గుర్తుందా ? 2014 ఎన్నికల్లో అపజయం తర్వాత …జగన్ కు అంతకు ముందు లేని కొత్త నమ్మకాలు పుట్టుకొచ్చాయి.జోతిష్యుల్నిపిలిచి….తన భవిష్యత్తు గురించి అడిగారు….ఇప్పటికి ఓడిపోయినా రెండేళ్లలో రావటానికి రాజయోగం రెడీగా వుందనిచెప్పారు….అందుకే రెండేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తాం అని ఆయన పదేపదే చెప్పేవారు.ఐదేళ్లకు కదా ఎన్నికలు అనుకుంటే …అది మీ ప్రాబ్లమ్ …ఎవరేమనుకున్నా కాలచక్రం ఆగిపోదు కదా !జోతిష్యులు చెప్పిన ఆ రెండేళ్లు గడిచాయి.రాజయోగం సంగతి తర్వాత వున్న ఎమ్మెల్యేలు కూడా ఫ్యాన్ రెక్కల్లా ఊడిపోతున్నారు.నివాస గృహాలు,సాక్షి బిల్డింగ్ తో సహా భారీ స్థాయిలో ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది.భవిష్యత్ బాగుంటుందన్న ఆశను ఒకసారిగా నిరాశ కమ్మేసింది….

ఇది రాజకీయ కక్షసాధింపు అన్నధోరణిలో ఎదురు దాడికి దిగుదామంటే ఆ పరిస్థితి కూడాలేదు.కేసులు పెట్టిందేమో కాంగ్రెస్…. కేంద్రంలో అది ఇప్పుడు అధికారం లో లేదు ..అధికారంలో వున్న మోడీ పై విరుచుకు పడితే ఏమవుతుందో అందరికీ తెలుసు…చంద్రబాబును టార్గెట్ చేసినా ఫలితం అంతంతమాత్రం ….ఈ పరిస్థితుల్లో జగన్ మళ్ళీ జోస్యుల్ని పిలిపించుకున్నారు .ఈ క్లిష్ట పరిస్థితినుంచి గట్టెక్కే మార్గం ఏదని అడిగారట.దానికి పరిహారంగా వారు కొన్ని పూజలు ,హోమాలు సూచించారట…అవి ఫలిస్తాయో లేదో తరువాత సంగతి ..వాటిని బహిరంగంగా నిర్వహించే పరిస్థితి ఉందా?ఆయన ఓట్ బ్యాంక్ ఇలాంటి వ్యవహారాల్ని చూస్తూ ఊరుకుంటారా ఏంటి?కుదిరితే బహిరంగంగా లేకుంటే రహస్యంగా నైనా ఆ పూజలు,హోమాలు జరిగిపోతాయి.

జగన్ జోస్యుల్ని కలిసిన విషయం తెలియగానే…ఆ పార్టీ అభిమానులు కూడా తమకు తెలిసిన పండితుల్ని సంప్రదించారా? వారుచెప్పిన పరిహారాలు చేయించారా?అదే జరిగితే రాష్ట్రం లో జోస్యులకు పండగేపండగ.

Leave a Reply