ఎన్టీఆర్ ,బాబుని మిక్స్ చేస్తున్న వైసీపీ ..

 Posted November 3, 2016

ycp jagan mixed to ntr and chandrababu
రెండు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ కి అచ్చివచ్చిన ఓ అస్త్రానికి వైసీపీ పదును పెడుతోంది.2019 లో అధికారం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న వైసీపీ …1994 ఎన్నికల ముందు ఎన్టీఆర్ ఇచ్చిన సంపూర్ణ మధ్య నిషేధ నినాదాన్ని అంది పుచ్చుకోడానికి వైసీపీ వ్యూహకర్తలు నడుం కట్టారు.ఇదే విషయాన్ని జగన్ సన్నిహితుడు ,వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చూచాయగా బయట పెట్టారు. సంపూర్ణ మద్యనిషేధం గురించి జగన్ ఆలోచిస్తున్నట్టు విజయసాయి తెలిపారు. ఇప్పటికే ఆ పధకాన్ని అమలు చేస్తున్న గుజరాత్,బీహార్ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయని అయన చెప్పారు.అంటే అయన దృష్టిలో మద్యం మీద వచ్చే ఆదాయం పడిపోయినా ఆ రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని చెప్పబోతున్నారు.

1994 తో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యం మీద వచ్చే ఆదాయాన్ని వదులుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో ఇరుక్కోవడం ఖాయం. అయినా అదే నినాదాన్ని వైసీపీ ఎంచుకోడానికి స్ఫూర్తి మాత్రం చంద్రబాబే అనుకోవాలి.విభజన నేపథ్యంలో ఎన్ని ఇబ్బందులున్నా రైతు రుణ మాఫీ ,ద్వాక్రా రుణాల మాఫీ వంటి హామీలు ఇచ్చి 2014 లో అధికారాన్ని కైవసం చేసుకున్న బాబు కళ్ల ముందుండగా ఇక వెనకడుగు ఎందుకని పాత రాష్ట్రాలకి కూడా పదును పెడుతోంది వైసీపీ.ఏదేమైనా అటు ఎన్టీఆర్ ని ,ఇటు చంద్రబాబుని మిక్స్ చేసి 2019 ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్న వైసీపీ తెలివితేటల్ని మెచ్చుకోవాల్సిందే.కానీ వ్యూహాలు వేసినంత తేలిగ్గాదు వాటికి వోటర్లని ఒప్పించడం…2009 లో బాబు మీ అకౌంట్ లో డబ్బులు వేస్తామన్నా జనం నమ్మలేదు.దేనికైనా సమయం ,సందర్భం అవసరం.ఇప్పుడు వైసీపీ ఆలోచించుకోవాల్సింది అదొక్కటే …

SHARE