ఎన్టీఆర్ విగ్రహం..గోంగూర యుద్ధం

sted October 17, 2016

ycp leaders through out Sorrel leaves dust on ntr statue chilakaluripet

ఎన్టీఆర్ విగ్రహం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట నియోజకవర్గంలో గోంగూర గొడవ సంచలనం రేపింది.మద్దిరాల గ్రామంలో వైసీపీ గడప గడపకి కార్యక్రమం చేపట్టింది.అందులో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు విందు కూడా ఏర్పాటు చేసుకున్నారు.అంతా సవ్యంగా సాగింది అనుకుంటున్న తరుణంలో తెల్లవారి లేచి చూసే సరికి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం నిండా గోంగూర చల్లి వుంది.విషయం తెలిసిన తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.ఇదంతా వైసీపీ పనేనని ఆరోపిస్తూ ఆందోళనకి దిగారు.విషయం తెలిసిన పోలీసులు మద్దిరాల చేరుకొని దేశం శ్రేణుల్ని శాంతింపచేశారు.ఎన్టీఆర్ విగ్రహంపై గోంగూర చల్లిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఓ ముఖ్య కార్యక్రమంలో వున్న మంత్రి,నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇదే అంశంపై మాట్లాడారు.ఇదంతా చూస్తున్న వాళ్ళు మిగిలిపోయిన గోంగూరతో ఇంత యుద్ధం జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారు.

SHARE