బాబుకి మంగళగిరి ఎమ్మెల్యే షాక్ ..

 ycp mla alla ramakrishna reddy case  chandrababu
ఓటుకి నోటు కేసు మళ్లీ బాబు మెడకు చుట్టుకుంటోంది.ఈసారి కెసిఆర్ సర్కార్ కాకుండా వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాబుని టార్గెట్ చేశారు.బాబుకి వ్యతిరేకంగా ఫోరెన్సిక్ నివేదిక కనిపిస్తున్నా విచారణ చురుగ్గా సాగడం లేదని ఆయన ఏసీబీ కోర్టుని ఆశ్రయించారు.పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు పునర్విచారణ జరిపి సెప్టెంబర్ 29 కల్లా నివేదిక ఇవ్వాలని ఏసీబీ ని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా బాబు మీద వైసీపీ విరుచుకుపడింది.బాబు రాజీనామాకు ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఇక పిటిషన్ వేసిన ఆళ్ళ మరో అడుగు ముందుకెళ్లి బాబుకి నైతికత ఉంటే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ కి వెళ్ళొద్దని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఒకటి…ఎన్నో కేసుల్లో అప్పీల్ కెళుతున్న వైసీపీ అధినేత జగన్ కి నైతికత లేదనుకుందామా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here