కృష్ణా,నెల్లూరు వాళ్ళది ఏమి లౌక్యం?

Posted [relativedate]

ycp mla anil kumar yadav calls to jalil khan bcom lo physics brother
రాజకీయాలు,పెళ్లి సంబంధాలు,చుట్టరికం,వ్యాపార సంబంధాలు…ఇలా ఏ టాపిక్ వచ్చినా కృష్ణా,నెల్లూరు జిల్లాల వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని సరదాగా అంటుంటారు.వాళ్ళ తెలివితేటల తో సరితూగడం కష్టమని కాస్త వినోదభరితంగా చెప్పడం ఆ వ్యాఖ్యల ఉద్దేశం.ఆ మాటల్లో నిజముందో లేదో గానీ ఆ రెండు జిల్లాల వాళ్ళు ఒకరికొకరు ఎదురుపడితే ఎలా ఉంటుందో మాత్రం అర్ధమైంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు చూస్తే వారి మాటకారితనం భలే కదా అనిపించింది.అసలు విషయం చెప్పకుండా ఈ ఊరింపులు ఏంటనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాం..

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్,ఆ పార్టీ నుంచి గెలిచి క్యాబినెట్ మీద ఆశతో టీడీపీ లో చేరిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో ఒకరికొకరు ఎదురుపడ్డారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బి.కామ్ లో ఫిజిక్స్ అని చెప్పి డంగైపోయిన జలీల్ ఖాన్ కనపడగానే అనిల్ ఏమని పిలిచాడో తెలుసా ? బి.కామ్ లో ఫిజిక్స్ అన్నా నమస్తే అని అనిల్ పలకరించాడు.ఈ మాట అనగానే అక్కడున్న ప్రజాప్రతినిధులు,విలేకరులు ముసిముసిగా నవ్వుతూ కనిపించారు.అక్కడున్నది జలీల్ ఖాన్ కాకుండా ఇంకోరైతే ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళేమో.కానీ జలీల్ ఖాన్ అదేమీ పట్టించుకోకుండా భలే కౌంటర్ ఇచ్చాడు.మాములుగా ఎన్ని మాటలు మాట్లాడినా ఈ విలేకరులు చూపించరు…అలా మాట్లాడితే ఎంత పబ్లిసిటీ వచ్చిందో చూడు అని బదులివ్వగానే అనిల్ కి ఇంకేమి చెప్పాలో అర్ధం కాలేదు.కానీ ఆ ఇద్దరి ని గమనిస్తున్న ఓ ఎమ్మెల్యే ఎంతైనా కృష్ణా,నెల్లూరు వాళ్ళ దెబ్బకి తట్టుకోవడం కష్టమనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

Leave a Reply