Posted [relativedate]
వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ప్లాన్ కి ఊహించని షాక్ తగిలింది.ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహం గురించి బయటకు పొక్కగానే ఎమ్మెల్యేలు వైల్డ్ గా రియాక్ట్ అయ్యారట. జగన్ సన్నిహిత కోటరీ లో జరిగిన ఈ చర్చ గురించి బయటికి తెలియగానే నిన్న రోజంతా వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు రింగ్ అవుతూనే వున్నాయి.అనుచరులు దీని గురించి ప్రశ్నిస్తుండగానే సాటి ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి ఇది నిజమేనా అని అడుగుతూనే ఉన్నారట.ఎంపీ ల రాజీనామా ఓకే గానీ ఎమ్మెల్యేల రాజీనామా అంటే కష్టమవుతుందని వారిలో వారే వ్యాఖ్యానించుకున్నారట.విషయం ఆనోటా ఈ నోటా పాకి జగన్ దాకా వెళ్లిందట.అంతే అయన షాక్ అయ్యారట.
అతి రహస్యంగా చర్చించిన విషయం బయటికి ఎలా వెళ్లిందో అర్ధంగాక జగన్ సీరియస్ అయిపోయారంట.పైగా సర్వేలు చెప్తున్న ప్రకారం ఉప ఎన్నికలకి వెళితే బాగుంటుందన్న తన ఆలోచనకి భిన్నమైన స్పందన రావడం కూడా ఆయన్ని నిరుత్సాహపరిచిందట.అసలు అధిష్టానమే నెమ్మదిగా ఈ విషయాన్ని లీక్ చేసి రియాక్షన్ కనుక్కుందని కొందరు చెపుతున్నారు.ఏదేమైనా ఉపఎన్నికల వార్తతో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు ఆగకుండా మోగుతూనే వున్నాయి.వారు ఉపఎన్నికలకు సిద్ధం కాదన్న సంకేతంతో జగన్ ఆలోచనకు ఎదురుతిరిగినట్టే కనిపిస్తోంది.దీంతో సరికొత్త సంక్షోభం రాకుండా అబ్బే అలాంటి ఆలోచనే చేయలేదు అని చెప్పడం ద్వారా ఈ సమస్య నుంచి జగన్ బయటపడే అవకాశముంది.