వైసీపీ ఎంపీలు జంప్ అవుతున్నారా?

Posted November 28, 2016, 10:51 am

jagnmohan-reddy-ptiవైసీపీ నుంచి టీడీపీలోకి మరోసారి వలసలు జరగనున్నాయా అంటే ఔననే అంటున్నారు టీడీపీ నేతలు. ఇన్నాళ్లూ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల టీడీపీకి లోకి ఈ చేరికలకు ఫుల్ స్టాప్ పడిందట. ఇప్పుడు బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీ నుంచి మరోసారి టీడీపీలోకి భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

వైసీపీ నుంచి జంప్ అయ్యే వారిలో ముందు ఎంపీలే ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీలోకి జంప్ అయితే ఎక్కువ ప్రచారం లభిస్తుంది. ప్రభుత్వంపై జగన్, పవర్ పోరు పెరుగుతున్న తరుణంలో ఈ జాయినింగ్స్ తో టీడీపీకి పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. పార్లమెంటులోనూ సైకిల్ బలం పెరుగుతుంది. అన్నింటికి మించి చంద్రబాబు దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసే అవకాశముంది.