వైసీపీ ఎంపీల రాజీనామా ?

 ycp mp's are resignation
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగప్రవేశంతో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ కసరత్తు ప్రారంభించారు.ప్రత్యేక హోదా అస్త్రం చేజారకుండా చూసుకోవడం,ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడం మీద జగన్ ప్రధానంగా దృష్టి సారించారు.ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోకపోతే పట్టు తప్పుతుందని భావిస్తున్న అయన …వచ్చే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీ లతో రాజీనామా చేస్తే ఎలా ఉంటుందోనని వ్యూహకర్తలతో చర్చిస్తున్నారు.పార్లమెంట్ వేదికగా హోదా డిమాండ్ తో రాజీనామా చేస్తే ప్రజల్లో,క్యాడర్ లో వైసీపీ మీద విశ్వాసం పెరుగుతుందని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విషయంలో తెలుగుదేశం పోటీపడలేకపోవచ్చని కూడా వైసీపీ అభిప్రాయం .

SHARE