వైసీపీలో మ‌రో వికెట్ డౌన్?

0
528
ycp one more wicket down

Posted [relativedate]

ycp one more wicket down
రాజ‌కీయాల్లో గెలుపే గీటురాయి. విజ‌యం సాధించే నాయ‌కుడికే గుర్తింపు. ఒక్క‌సారి ఓడిపోతే ఎంత రాజ‌కీయ అనుభ‌వ‌మున్నా వేస్టే. ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ నాయ‌కుడు న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి కూడా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఆయ‌న‌ను వైసీపీ అధినాయ‌క‌త్వం ప‌క్క‌న బెట్టేసింది. దీంతో 2014కు ముందు వ‌ర‌కు మీడియాలో బాగా ఫోక‌స్ అయిన ప్ర‌స‌న్న ఆ త‌ర్వాత తెర‌మ‌రుగ‌య్యారు. వైసీపీ లైట్ తీసుకోవ‌డంతో ఇక పార్టీ మారాల‌ని నిర్ణయించుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌ల్ల‌పురెడ్డి సైకిల్ ఎక్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి కుటుంబానికి టీడీపీతో ద‌శాబ్దాల అనుభ‌వ‌ముంది. ఆయ‌న గ‌తంలో ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఆ పార్టీ త‌ర‌పునే. పైగా టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి ప్ర‌స‌న్న స‌మీప బంధువు. అలాంటిది వైఎస్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న‌ … జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌య్యారు. వైసీపీలో చేరారు. ఉప ఎన్నిక‌ల్లో గెలిచి మ‌రోసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2014 లో అదృష్టం కలిసి రాలేదు. ఓట‌మి పాల‌వ్వాల్సి వ‌చ్చింది. అయితే ఓడిపోయిన ఆయ‌నను పార్టీ క్ర‌మంగా ప‌క్క‌న బెట్టేసింది.

గూడురు నియోజ‌క‌వ‌ర్గంలోని కోట మండ‌లం ప్ర‌స‌న్న సొంత ప్రాంతం. అక్క‌డ న‌కిలీ మ‌ద్యం కేసులో నిందితుడిగా ఉన్న అల్లంపాటి శ్యాం ప్ర‌సాద్ రెడ్డి.. వైసీపీ నాయ‌కుడిగా ఉన్నారు. ఆయ‌న త‌న‌కు వ్య‌తిరేకంగా పార్టీలో అగ్గి రాజేస్తున్నార‌ని ప్ర‌స‌న్న భావిస్తున్నారు. ఇక ఇటీవ‌ల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తార‌ని ఆశిస్తే.. వైసీపీ అధినాయ‌క‌త్వం ప్ర‌స‌న్న‌కు మొండిచేయి చూపింది. పైగా త‌మ‌కు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గమైన ఆనం కుటుంబానికి వైసీపీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. కాబ‌ట్టి ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న విసుగు చెందార‌ట‌. కాబ‌ట్టి ఇదే అద‌నుగా తాను పార్టీ మారేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. అందులో భాగంగా స్థానిక ఎన్నిక‌ల్లో త‌న వ‌ర్గానికి చెందిన నాయ‌కులంతా సైకిల్ కే ఓటేసేలా చూస్తాన‌ని టీడీపీ నాయ‌కుల‌కు మాట కూడా ఇచ్చార‌ట‌.

ఎలాగూ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అండ ఉండ‌నే ఉంది. కాబ‌ట్టి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి సైకిల్ ఎక్క‌డం లాంఛ‌న‌మేన‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇది వైసీపీకి చాలా గ‌ట్టి దెబ్బేనంటున్నారు ఆ పార్టీ నాయకులు. అస‌లే నెల్లూరులో వైసీపీ రోజురోజుకు వీక్ అవుతుంటే.. మ‌రో వికెట్ డౌన్ కావ‌డం పూడ్చుకోలేని న‌ష్ట‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది!!!

Leave a Reply