తెలుగుదేశం పార్టీలోకి మరో వైసిపి ఎమ్మెల్యే జంప్…

Posted December 21, 2016

ycp pamarru mla Uppuleti kalpana jump to tdp partyఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ దాదాపు తగిలినట్టే కనిపిస్తోంది.పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన శుక్రవారం టీడీపీలోకి చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది ఈ దిశగా ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట రావును కలిశారు..

పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ హయాం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటోంది. ఆయన స్వగ్రామం నిమ్మకూరు పామర్రు మండలం లో ఉండడంతో ఆ పార్టీకి ప్రజల నుంచి మంచి మద్దతు ఉంది. గత ఎన్నికల్లో రెండుసార్లు ఓటమిపాలైన కల్పనకు సానుభూతి ఓట్లు కలిసొచ్చాయి. ఎమ్మెల్యే అయినా పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత దక్కకపోవడంతో వైసీపీ ని వీడాలని డిసైడ్ అయ్యారట..నెమ్మలూరు వద్ద బెల్‌ శంకుస్థాపనలో ఆమె సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. తర్వాత నుంచి టీడీపీతో టచ్‌లో ఉన్నారట.

ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పార్టీలో చేరినప్పుడే కల్పన కూడా వైసీపీ లో చేరుతున్నట్టు గా వార్తలొచ్చాయి. కానీ ఆ ఉద్దేశం లేదని ఆమె చెబుతూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఈ వారంలో కల్పన సీఎం చంద్రబాబును కలిసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే పార్టీలో చేరతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

**2004 లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కల్పన నిడుమోలు నుంచి మొదటి సారి గా పోటీ పరాజయం పాలయ్యారు
***2009లో ఎన్నికల్లో రెండోసారి కూడా టీడీపీ టికెట్‌పై పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసి డి.వై.దాస్‌ చేతిలో పరాజయం చెందారు.
** 2013లో ఆమె టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పామర్రు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యను ఓడించారు.
** టీడీపీలో ఉండగా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా కూడా పని చేశారు. ఆతర్వాత పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జిగా… గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ వర్ల రామయ్యను టీడీపీ నియమించింది
***2014 అసెంబ్లీ ఎన్నికల్లో పామర్రు నుంచి వైసీపీ అభ్యర్థిగా కల్పన పోటీ చేసి గెలిచారు…

SHARE