వైసీపీ దూకుడుకి స్పీడ్ బ్రేకర్ ..

 Posted October 18, 2016

ycp party 12 mlas get notices from privilege committee
ప్రత్యేక హోదా డిమాండ్ తో అసెంబ్లీ లో రచ్చరచ్చ చేసిన వైసీపీ ఎమ్మెల్యేల దూకుడికి బ్రేక్ పడుతోంది.గత సమావేశాల్లో అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ ఏక్కి మరీ స్పీకర్ ని చుట్టుముట్టిన ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్ కమిటీ దృష్టి పెట్టింది.సభలో అదుపు తప్పి ప్రవర్తించారంటూ 12 మంది వైసీపీ సభ్యులకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25,26 తేదీల్లో ఆ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళే ..

1.కంబాల జోగులు
2.కిలివేటి సంజీవయ్య
3 . పాశం సునీల్ కుమార్
4.ముత్యాల నాయుడు
5.ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
6.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
7. దాటిశెట్టి రాజయ్య
8. కొరముట్ల శ్రీనివాసులు
9. చెర్ల జగ్గిరెడ్డి
10.రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
11.కొడాలి నాని
12. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

SHARE