వైసీపీ నుంచి ఇంకా జంప్ జిలానీలు?

Posted December 22, 2016

ycp party mlas will jump to tdp party
ఏపీ లో ఆగిపోయిందనుకున్న ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ఊపందుకుంటోంది.కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పార్టీ మారడం ఇప్పటికే తేలిపోయింది.ఆమె టీడీపీ నుంచి వచ్చింది.మళ్లీ అక్కడికే చేరిపోతోంది వైసీపీ తనకు తానే ధైర్యం చెప్పుకుంటోంది.అయితే ఆ పార్టీ అనుకున్నట్టు వైసీపీ నుంచి వలసలు ఆ ఒక్క ఎమ్మెల్యే తో ఆగిపోవని తెలుస్తోంది.మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ నుంచి టీడీపీ లో చేరబోతున్నట్టు సమాచారం. కృష్ణా,ప్రకాశం ,చిత్తూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ అధిష్టానం తో టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మరికొందరు తమతో మాట్లాడుతున్నట్టు నిర్థారించారు.అయితే ఎవరన్నది మాత్రం అయన చెప్పలేదు.దీంతో వైసీపీ శ్రేణుల్లో అలజడి మొదలైంది.ఈసారి పార్టీకి ఝలక్ ఇచ్చే వాళ్ళు ఎవరో ఆరా తీసేందుకు హైకమాండ్ కసరత్తు స్టార్ట్ అయింది.కానీ ఎవరికి వారు అలాంటిదేమీ లేదని చెప్పడంతో …గట్టిగా అడిగితే తామే అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్న భయంతో కిందామీదా పడుతోంది.సంక్రాంతి టైం లేదా ఆ తర్వాత టీడీపీ లో కొత్త చేరికలు ఉండొచ్చని సమాచారం.

SHARE