జగన్ నిర్ణయం పై వైసీపీ ఎంపీల అసహనం?

 Posted October 27, 2016

ycp party mps feel sad about jagan decision on mps
ప్రత్యేక హోదా డిమాండ్ తో రాజీనామాల దాకా వెళ్తామంటున్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీలు గుర్రుగా వున్నారు.హోదా రావాలని ఆంధ్రుల్లో ఉన్నప్పటికీ దాని కోసం ఉద్యమించే స్థాయిలో అది లేదని ఇప్పటికే చాలా సార్లు రుజువైందని వారి అభిప్రాయం.జగన్,పవన్ తో వివిధ పార్టీల నాయకులు దాని గురించి మాట్లాడుతున్నారే గానీ క్షేత్రస్థాయిలో హోదా డిమాండ్ కి ఉద్యమ తీవ్రత కనిపించడం లేదని వైసీపీ ఎంపీ లు అనుకుంటున్నారు.హోదా అంశంపై పోరాటం పార్టీకి ఉపయోగపడొచ్చుగానీ అదే నినాదంగా ఎన్నికలకు వెళితే అనుకున్న ప్రయోజనం రాకపోవచ్చని రాయలసీమకి చెందిన ఓ యువ ఎంపీ అంటున్నారట.అయన జగన్ కి కూడా సన్నిహితంగా వ్యవహరిస్తారు.రాజీనామా విషయానికి ప్రచారం కల్పించకుండా హోదా పోరుకి పరిమితమైతే మంచిదని ఓ సీనియర్ ఎంపీ కూడా క్లోజ్ సర్కిల్స్ లో అంటున్న మాట.ఉప ఎన్నికల్లో ఒక్క స్థానం కోల్పోయినా మళ్లీ 2019 ఎన్నికలకి సిద్ధం కావడం కష్టమవుతుందని అయన ఆలోచన.ఇదే విషయాన్ని జగన్ దగ్గరికి తీసుకెళదామని కొందరు ఎంపీలు అనుకుంటున్నా పిల్లి మెడలో గంట కట్టే వాళ్ళని వెదికే పనిలో వున్నారు.

SHARE