సాక్షి,వైసీపీ కి మతిమరుపు?

0
1046

 ycp party sakshi paper have short term memory loss
ఓటుకునోటు కేసుకి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హై కోర్ట్ లో క్వాష్ పిటిషన్ వేయగానే సాక్షి,వైసీపీ నేతలు అయన మీద దుమ్మెత్తి పోశారు.తప్పు చేసి తప్పించుకోడానికి కోర్టు కెళ్లాడని బాబు ని చీల్చి చెండాడారు.అయితే ఓ విషయం అర్ధం కావడం లేదు.ఓటుకునోటు కేసులో అదేలేండి సాక్షి చెప్పినట్టు ఓటుకి కోట్లు కేసు ప్రస్తుతం కోర్టు విచారణ పరిధిలో వుంది.దానిపై బాబు పై కోర్టుని ఆశ్రయించారు.నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకుంటుందా? అసలు కోర్టు మెట్లు ఎక్కడమే తప్పని వాదించడం ఎంతవరకు సమంజసం?ఆ మాటలతో మీరు బాబు కన్నా న్యాయవ్యవస్థనే కించపరుస్తున్నట్టు వుంది.

ఇదంతా వదిలిపెడితే గతంలో కిందినుంచి సుప్రీమ్ కోర్టు దాకా వైసీపీ అధినేత ఎక్కని మెట్టుందా? ఆ రోజుల్లో మీరేమన్నారో మాకు గుర్తుంది …కేసు పెట్టినంత మాత్రాన తప్పు చేసినట్టా? విచారణ జరిపినంత మాత్రాన నేరారోపణ రుజువైనట్టా ? తుదితీర్పు వచ్చేదాకా దోషి కాదు …వగైరా వగైరా డైలాగులు చాలా విన్నాం.ఇప్పుడే అదే నోటితో కోర్టు లోపిటిషన్ వేయడమే తప్పంటున్నారు.అప్పట్లో మీరు వేసినన్ని పిటిషన్లు ఏ రాజకీయ పార్టీ,నేత వేసి వుండరు.బహుశా మతిమరుపుతో పాత విషయాలు మర్చిపోయుంటారని గుర్తు చేస్తున్నామంతే …

Leave a Reply