పవన్ మీద వైసీపీ భూసేకరణ అస్త్రం ?

Posted April 14, 2017

ycp plans against pawan kalyan
ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ ని పొగిడిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీ కృతజ్ఞతలు చెప్పకపోగా అదిరిపోయే షాక్ ఇచ్చే ప్లాన్ రెడీ చేసింది.అధికార టీడీపీ తో పవన్ కి ఇంకా దూరం పెంచేందుకు పక్కాగా వ్యూహం ఖరారు చేసింది.అమరావతి రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ని అస్త్రం గా మలచి పవన్ మీద ప్రయోగిస్తోంది.ఇప్పటికే భూసేకరణకు వ్యతిరేకంగా వైసీపీ కి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానిక రైతులతో కలిసి ఉద్యమానికి సిద్ధమయ్యారు.వారితో కలిసి పొలం పనుల్లో పాల్గొనడం ద్వారా తన నిరసన ఇప్పటికే తెలియజేస్తున్నారు.ఇక భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన పెనుమాక లో సామాజికంగా, ఆర్ధికంగా వైసీపీ కి అనుకూల వాతావరణం ఉంటుంది.ఆ పార్టీ ఎమ్మెల్యే నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటున్నారు.అయినా పెనుమాక రైతుల పేరిట జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కి పెనుమాక రైతులు తమ తరపున పోరాటం చేయాలని లేఖ రాయడం వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది.

రైతులు పవన్ కి రాసిన లేఖ

ycp plans against pawan kalyan
పెనుమాక రైతుల లేఖ ఆధారంగా పవన్ రంగంలోకి దిగితే టీడీపీ సర్కార్ ఇబ్బందిపడుతుంది.ఒకవేళ పవన్ స్పందించకపోతే జనసేన మాట తప్పిందని ఇరుకున పెట్టొచ్చు .ఇలా ఆలోచించి వైసీపీ ఈ వ్యూహం ఎన్నుకుంది .పవన్ తమకు సానుకూలంగా మాట్లాడినా ఆయన్ని టీడీపీ ఏజెంట్ గా చిత్రించేందుకే వైసీపీ కంకణం కట్టుకుంది.మరో వైపు ఇప్పటికే భూసమీకరణ వ్యతిరేకించిన గ్రామాల రైతులకు పదేపదే అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం.అయితే ఎన్ని చేసినా,కాలం గడిచినా పెద్దగా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తప్పనిసరై భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది.ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రయోగించిన భూసేకరణ అస్త్రాన్ని పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

SHARE