ఆ వీడియోతో వైసీపీ పరువుపోయే ..

Posted October 8, 2016

 ycp said lied lokesh chinarajappa fight
సాక్షి,వైసీపీ చినబాబు టార్గెట్ గా చినరాజప్ప ఎపిసోడ్ తెగ రక్తి కట్టించాయి.చినబాబు చెలరేగిపోతే రాజప్ప కన్నీళ్లు పెట్టుకున్నట్టు కధలు అల్లేశాయి.ఇది నిజమేనేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఇంతలో డామేజ్ కంట్రోల్ కోసం ఆ రోజు శిక్షణా శిబిరంలో వ్యవహారాన్నంతా టీడీపీ బయటపెట్టింది.ఒరిజినల్ వీడియో సోషల్ మీడియా లోకి రిలీజ్ చేసింది.తీరా ఆ వీడియో చూస్తే కూన రవికుమార్ అనే ఎమ్మెల్యే లోకేష్ తో పార్టీ నిర్మాణానికి సంబంధించిన ఓ విషయంలో హాయిగా మాట్లాడుతున్నారు..ఓ విధంగా చెప్పాలంటే వాదిస్తున్నారు.అదే విషయంలో కలగజేసుకుని చినరాజప్ప కూడా లోకేష్ కి పార్టీ పాత పద్ధతిని వివరించారు.ఆ సమయంలో తీసిన ఫోటోని పట్టుకుని …సోషల్ మీడియాలో ఎవడో తుంటరి పెట్టిన కామెంట్స్ ఆధారంగా సాక్షి,వైసీపీ స్వైరవిహారం చేశాయి.తాజా వీడియో తో వాళ్ళ మాటకున్న విలువ ఇంకాస్త తగ్గడం ఖాయం.

[wpdevart_youtube]78_K3jn_vtU[/wpdevart_youtube]

SHARE