వైసీపీ సెంటిమెంట్ ప్రచారానికి వరద దెబ్బ..

  ycp sentiment gone floods reason
 చంద్రబాబు అధికారంలోకి వస్తే వరుణుడు కరుణ చూపడని నాడు కాంగ్రెస్ …ఆ తరువాత వైసీపీ విస్తృతంగా ప్రచారం చేశాయి.అదొక సెంటిమెంట్ కింద రాజేసి రైతుల మనసు విరవడానికి చేయని ప్రయత్నం లేదు.కిందటేడు నవంబర్ లోసీమ జిల్లాల్లో కురిసిన వానలు ఆ ప్రచారాన్ని పాక్షికంగా దెబ్బ కొడితే …తాజా వర్షాలు ఆ వాదనను తుడిచి పెట్టాయి.అదే సమయంలో నీరు చెట్టు  పధకం వల్ల చెరువులన్నీ నిండిపోయాయి.పట్టిసీమ ఫలితాలు కనిపిస్తున్నాయి.ఇవన్నీ చూస్తుంటే వైసీపీ కి ఉన్న ఓ సెంటిమెంట్ అస్త్రం జారిపోయినట్టే కనిపిస్తోంది.

        తాజా వరదలు వైసీపీ కి ఆయుధంగా మారుతున్న హోదా సెంటిమెంట్ మీద కూడా వర్షం కురిసింది.వరద ముంచెత్తింది.ఏలూరు యువభేరిలో హోదా అంశం మీద జగన్ లేవనెత్తిన విషయాలపై అంతటా చర్చ జరగాల్సిన టైం లో వానలు,వరదలతో జనం దృష్టి మళ్లింది.తాజాగా వరుణుడు విజృంభణ రెండు విధాలుగా వైసీపీ కి చెక్ పెట్టింది.

SHARE