సర్వే తో ఊపిరి పీల్చుకున్న వైసీపీ..

ycp special status surveyప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్న వైసీపీ దాని ఫలితాన్ని తెలుసుకోడానికి ఓ రహస్య సర్వే నిర్వహిస్తోంది.పనిలో పనిగా కాపు ఉద్యమ ప్రభావం,ప్రజా క్షేత్రంలో బలాబలాలు,ఎమ్మెల్యేల పార్టీ మార్పు ….వంటి అంశాలపై జనం నాడి పట్టేందుకు వైసీపీ వ్యూహకర్తలు ప్రయత్నించారు.అందులో వచ్చిన ఫలితాల్ని విశ్లేషించే పనిలో పడ్డారు.అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న హోదా ఉద్యమ ప్రభావం ఇంకా జనంలోకి వెళ్లలేదని తెలిసింది.హోదా విషయంలో కొద్దోగొప్పో అసంతృప్తి ఉన్నప్పటికీ వెంకయ్య కౌంటర్ ఎటాక్ తో ప్రజలు కొంత అయోమయంలో పడినట్టు రిజల్ట్ వచ్చింది.కాపు ఉద్యమం కూడా ఉండేకొద్దీ రాజకీయ ప్రభావం వల్లే జరుగుతోందన్న అభిప్రాయం పెరిగిందట.అందుకే ఈ రెండు అంశాల్లో మరింత దూకుడుగా వ్యవహరించాలని వైసీపీ నిర్ణయించింది.అందులో భాగమే తాజాగా సీఎం చంద్రబాబుకి ముద్రగడ బహిరంగ లేఖ.హోదా అంశంపై జనంలో అవగాహన పెంచేందుకు జగన్ చేపడుతున్న కార్యక్రమాలు.

అయితే ఈ సర్వే లో వెల్లడైన రెండు విషయాలు మాత్రం వైసీపీ కి సంతోషం కలగజేసాయి.2014 ఎన్నికలతో పోల్చినపుడు క్షేత్ర స్థాయిలో అధికార,ప్రతిపక్షాల బలాబలాల్లో పెద్దగా మార్పు రాలేదంట.అందులో సంబర పడటానికి ఏముంది అనుకుంటున్నారా ? 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్ళిపోయినా క్షేత్ర స్థాయిలో బలం అలాగే ఉందంటే భవిష్యత్ బాగుంటుందని వైసీపీ వ్యూహకర్తలు ఆశిస్తున్నారు.చూద్దాం ఏమవుతుందో !

SHARE