Posted [relativedate]
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం చేయడం అంత తేలిగ్గాదు. అది కూడా ఏ తీవ్రవాద సంస్థో అయితే ఏమోగానీ ప్రతిపక్షమే అందుకు సహకారం అందించడం అంటే సంచలనాలకు సంచలనం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందని టీడీపీ కి చెందిన మాల్యాద్రి అనే నాయకుడు సంచలన ఆరోపణ చేసాడు. ఇటీవల బాబు ఢిల్లీ పర్యటనలో అయన మీద రెక్కీ జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అయన వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు ,చేసిన ప్రకటనలు అందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు.
ఇంకో ఏడాదిలో ఎన్నికలు వస్తాయంటూ వైసీపీ అధినేత జగన్ పదేపదే చెప్పడాన్ని….చంద్రబాబుని ఆ దేవుడు కూడా కాపాడలేడని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడాన్ని మాల్యాద్రి డౌట్ పడుతున్నారు .ఒకప్పుడు బాబు మీద అలిపిరి దాడి జరగడానికి ముందు కూడా అప్పటి కాంగ్రెస్ నేతల నోటి నుంచి ఇలాంటి మాటలే వచ్చాయని …ఇప్పుడు వైసీపీ నేతల నోట వస్తున్న మాటలు చూస్తుంటే అనుమానం కలుగుతోందని అయన అంటున్నారు.మొత్తానికి వైసీపీ మీద టీడీపీ డౌట్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి ..